Prabhas: హను రాఘవపూడి ఫైనల్ నేరేషన్ ఇచ్చాడు, ఇంకో రాధే శ్యామ్ అవ్వకపోతే అదే హ్యాపీ

Prabhas: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది అని అనిపించుకున్నాడు. ఆ సినిమాను చాలా అద్భుతంగా తరికెక్కించాడు హను. చాలామందికి మణిరత్నం సినిమాని చూసిన ఒక ఫీలింగ్ కలిగింది. ఆ సినిమా తర్వాత చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా కూడా మంచి హిట్ అయింది. నాని కెరియర్ కూడా ఆ సినిమా మంచి ప్లస్ అయింది. నాని కెరియర్లో ఉన్న బెస్ట్ ఫిలిమ్స్ లో ఆ సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు.

Prabhas with Hanu Raghavapudi

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా తర్వాత హను తెరకెక్కించిన సినిమా లై. నితిన్ మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చి ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో నితిన్ మాత్రం చాలా స్టైలిష్ గా చూపించాడు హను. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని చాలామంది అంచనా వేశారు. కానీ అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి. ఈ సినిమా తర్వాత చేసిన పడి పడి లేచే మనసు సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది.

- Advertisement -

ఇకపోతే హను తెరకెక్కించే సినిమాల్లో ఫస్ట్ అఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం ఎక్కడో మొదలై ఎక్కడెక్కడకు వెళ్ళిపోతుంది. అందుకని హను చివరిగా చేసిన సీతారామం సినిమాలో సెకండ్ హాఫ్ ను చాలా అద్భుతంగా రాసుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పుడు హను ప్రభాస్ తో సినిమా చేయనున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. 75 సీన్స్ ఉన్న స్టోరీని ప్రభాస్ కి డైరెక్ట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ హాఫ్ కూడా చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తుంది. సెకండాఫ్ అద్భుతంగా వచ్చింది అని అంటే సినిమా హిట్ అయినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే హను సెకండ్ ఆ విషయంలోనే కొంచెం వీక్.

లేకపోతే హను చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అలానే రాధే శ్యామ్ సినిమాను చేసిన రాధాకృష్ణ కుమార్ కూడా చంద్రశేఖర్ ఏలేటి దగ్గర పనిచేశాడు. రాధాకృష్ణ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు మళ్లీ చంద్రశేఖర్ ఏలేటి శిష్యుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే అటువంటి రిజల్ట్ రాకపోతే చాలు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు