Prabhas- Hanu : ప్రభాస్ సినిమా కోసం హను రాఘవపూడి పని మొదలుపెట్టసాడుగా

Prabhas- Hanu : అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా చాలామందికి లైబ్రరీలో కూర్చొని ఒక పుస్తకాన్ని. ముఖ్యంగా సినిమాలోని సంభాషణలు చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అది ఒక మణిరత్నం కైండ్ ఆఫ్ సినిమా అని చాలామందికి అనిపించింది. వాస్తవానికి ఆ సినిమాలో మిధున అనే పాత్రను తెలుగు సినిమా మిస్సమ్మ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశాడు హను. సినిమాకి ప్లస్ పాయింట్ రథన్ అందించిన మ్యూజిక్. ఇప్పటికీ సీతారామం తర్వాత అంతటి బెస్ట్ వర్క్ అందాల రాక్షసి సినిమాకు మాత్రమే హను చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది.

హను ప్రభాస్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కల్కి సినిమాతో వెయ్యి కోట్లు సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాల సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రశాంత్ దర్శకత్వంలో సలార్ సీక్వెల్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సీక్వెల్ కూడా రానున్నాయి. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగతో ఒక ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఈ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

Prabhas Hanu

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ 1940 లో సెట్ చేయబడింది అంటూ హను రాఘవపూడి ఇదివరకే చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1940 అంటే అప్పటి లొకేషన్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ ను చూసే పనిలో పడింది చిత్ర యూనిట్. హను రాఘవపూడి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్న పిక్చర్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు సినిమాటోగ్రాఫర్ సుధీర్ చటర్జీ. ఇక్కడితో ఈ సినిమా పనులు మొదలైపోయాయి అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు