Prabhas : భైరవలో బాహుబలి పోలికలు… ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు గమనించారా?

Prabhas : తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ తరం హీరోలు చేసిన సినిమాలలో బాహుబలి ముందు వరుసలో ఉంటుంది. ఇక ఆ తర్వాత తాజాగా రిలీజ్ అయిన కల్కి సినిమాలోని భైరవ కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ ఇలాంటి యూనిక్ పాత్రలు మాత్రం ప్రభాస్ నే వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ప్రభాస్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ఐకానిక్ పాన్ ఇండియా హీరోగా చరిత్రను సృష్టిస్తున్నారు. అందుకే ఆయన సినిమా వస్తోంది అంటే ప్రమోషన్స్ అక్కర్లేదు అన్నంతగా హైప్ నెలకొంటోంది. అలాగే ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చ నడుస్తోంది. ఒకవైపు కలెక్షన్లు ఎంత వచ్చాయో ఎప్పటికప్పుడు లెక్కలు కడుతుంటే, మరోవైపు ఈ సినిమాలోని పాత్రలను ఇతర సినిమాలతో కంపేర్ చేస్తున్నారు. అందులో భాగంగానే బాహుబలితో భైరవను కూడా పోలుస్తున్నారు. పైగా ఈ పోలికల చూస్తుంటే బాహుబలి పాత్రకు ప్రభాస్ భైరవ రోల్ కు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బాహుబలి వర్సెస్ భైరవ

బాహుబలిని దర్శక దిగ్గజం జక్కన్న పవర్ ఫుల్ వ్యక్తిగా, అన్ని కళల్లో ఆరితేరిన వాడిగా చూపించారు. అంతేకాకుండా ఆ పేరుకు తగ్గట్టుగానే అత్యంత బలంతో, ఎవ్వరూ చేయలేని సాహసాలను కూడా చేసి చూపించే యోధుడిగా చూపించారు. అందులో భాగంగానే అంత పెద్ద శివ లింగాన్ని ఎవ్వరి హెల్ప్ లేకుండానే ఎత్తడం, ఎవ్వరూ ఎక్కలేని కొండను దాని పైనుంచి జలజలా పారుతున్న జలపాతాలను సైతం లెక్కచేయకుండా ఎక్కి చూపించడం వంటి సీన్లను క్రియేట్ చేశారు.

Kalki 2898 AD: Prabhas' new look promoting IPL 2024 reminds fans of  Baahubali; predict similar box office success

- Advertisement -

అలాగే కల్కిలో కూడా ప్రభాస్ రోల్ ఫుల్ పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా యాస్కిన్ సైన్యం దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నప్పటికీ భైరవ గట్టి పోటీని ఇచ్చి ఎదుర్కోగలుగుతాడు. ఇదే ఈ రెండు పాత్రలకు ఉన్న కామన్ అంశం. ఇక బాహుబలి శివ లింగాన్ని ఎత్తినట్టే కల్కిలో భైరవ ఒకానొక సందర్భంలో మెరుపు దాడి వల్ల కింద పడ్డ చక్రాన్ని ఒంటి చేత్తో లేపగలగడం చూడొచ్చు. ఒకవేళ మూవీ లవర్స్ ఎవరైనా ఇంకా బాహుబలి మేనియా నుంచి బయటకు రాకపోతే, కల్కిలోని భైరవ పాత్రను చూసినప్పుడు తప్పకుండా బాహుబలి సన్నివేశాలు కళ్ళ ముందు కదలాడుతాయి. చివరగా చెప్పేదేంటంటే భైరవ, బాహుబలి పాత్రలలో ఈ రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి. మరి మీరు ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను గమనించారా?

బాహుబలి రికార్డులను భైరవ బ్రేక్ చేస్తాడా?

కల్కి లాంటి సినిమా ఇంతకుముందు ఇండియన్ సినిమా హిస్టరీలోనే రాలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. కంప్లీట్ గా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు అందరూ ఈ సినిమా బాహుబలి రికార్డులను కొల్లగొడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలిలాగా ఈ మూవీ కూడా 2000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతుందా సర్వత్రా ఉత్కంఠభరితంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు