Prabhas: అసలు రాజా సాబ్ సినిమా ఎంతవరకు వచ్చిందంటే.?

Prabhas: ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో మంచి అద్భుతమైన హిట్ సినిమాలు అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా దాదాపు 1000 కోట్లు పైగా వసూలు చేసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి సినిమా కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక కల్కి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ లో మొత్తం రెండు వెయ్యి కోట్లు సినిమాలు ఉన్నాయని చెప్పాలి.

ప్రభాస్ సినిమా కెరియర్ విషయానికొస్తే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెబుతారు. ఇకపోతే తెలుగు సినిమాకి అంత మార్కెట్ లేదు అనుకునే తరుణంలో దాదాపు 200 కోట్లు పెట్టుబడి పెట్టి బాహుబలి సినిమాను తెరకెక్కించారు నిర్మాత శోభు. ఇకపోతే ప్రభాస్ మార్కెట్ కూడా తక్కువ అనుకునే టైంలో కేవలం రాజమౌళి విజన్ నమ్మి అంత డబ్బులు పెట్టారు. ఇకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో కొంతమేరకు మొదటి రోజు నెగిటివ్ టాక్ సాధించిన కూడా ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నపిల్లలు అందరికీ సినిమా విపరీతంగా నచ్చడంతో కలెక్షన్లకు కొత్తదారి చూపించండి బాహుబలి సినిమా.

The Raja Saab

- Advertisement -

బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. అయితే ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చూసి చాలా రోజులైంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తాడు అని ఎవరు ఊహించలేదు. నేను మారుతి ఎట్టకేలకు ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాకి రాజా సాబ్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇకపోతే ఈ సినిమా ఆల్బమ్ కంప్లీట్ కమర్షియల్ గా ఉండబోతుందని తమన్ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ 40% కంప్లీట్ కూడా అయిపోయినట్లు తెలుస్తుంది. ప్రభాస్ లో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ఈ సినిమాకు చూడొచ్చని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు