Prabhas: ఇంటికి కోడల్ని పరిచయం చేస్తాడనుకుంటే ఆడియన్స్ బుజ్జి ని పరిచయం చేస్తున్నాడు

Prabhas: ప్రస్తుత కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభ వలన తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయం అయిందని చెప్పొచ్చు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత చాలామంది తెలుగు సినిమా వైపు చూడటం మొదలుపెట్టారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ కూడా విపరీతంగా విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూడటం మొదలుపెట్టారు.

అయితే బాహుబలి సినిమా తర్వాత సలార్ మినహాయిస్తే వచ్చిన ఏ సినిమాలు కూడా ఊహించిన ఫలితాన్ని సాధించలేదు. అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ప్రభాస్ కెరియర్ కి మంచి కం బ్యాక్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ గా కూడా మరో సినిమా రానుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి.

Kalki

- Advertisement -

కల్కి సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు నాగ అశ్విన్ కావడం ఒకటి. అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రం కావడం. అయితే వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. నాగ అశ్విన్ ఊహకు తగినట్లు ప్రతి వస్తువుని కూడా తయారు చేశారు.

మరో స్క్రాచ్ వీడియో సిద్ధం

ప్రాసెస్ ని స్క్రాచ్ వీడియో అంటూ రిలీజ్ చేయటం మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు మూడు స్క్రాచ్ వీడియో పార్ట్ లను విడుదల చేశారు. ఇప్పుడు నాలుగో పార్ట్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో బైరవ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే పాత్రలో కనిపించనుంది దీపిక. అయితే దీపికా పాత్రను రేపు పరిచయం చేయనుంది చిత్ర యూనిట్. స్క్రాచ్ వీడియో పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేయనుంది.

ప్రభాస్ ఒక ఇంటి వాడు అవుతాడు అనుకున్నారు

ఇకపోతే ప్రభాస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎప్పుడు ఎప్పుడు ప్రభాస్ ఒక ఇంటివాడు అవుతాడని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీ ను పెట్టారు. అయితే చాలామంది ప్రభాస్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడని, ప్రభాస్ లైఫ్ లోకి ఒక అమ్మాయి ప్రవేశించనుంది అని అనుకున్నారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ కల్కి సినిమా నుంచి బుజ్జి పాత్రను రీవీల్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు