Prabhas: ప్రభాస్ ను జోకర్ అన్న బాలీవుడ్ యాక్టర్

Prabhas: ప్రస్తుతం తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత అందరూ చూపు ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు పడింది. ప్రభాస్ బాహుబలి సినిమా కోసం దాదాపు ఐదేళ్లపాటు సమయాన్ని కేటాయించాడు. ఒక సినిమా కోసం ఐదేళ్లు టైం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇకపోతే బాహుబలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.

బాహుబలి తర్వాత చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా తీవ్రంగా డిసప్పాయింట్ చేశాయి. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా కల్కి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ అద్భుతంగా డీల్ చేశాడు. ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 1100 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇకపోతే అందరికీ అన్ని సినిమాలు నచ్చాలి అని రూల్ లేదు. టైటానిక్ సినిమా నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. కల్కి సినిమా గురించి ఒక బాలీవుడ్ యాక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ప్రభాస్ ను జోకర్ అన్నాడు. బాలీవుడ్ నటుడు అర్షద్‌ వార్సి తెలుగు ప్రేక్షకులు కు కూడా పరిచయమే. మున్నాభాయ్ సిరీస్(Munnabha MBBS), జాలీ ఎల్‌ఎల్‌బీ(Jolly LLB), గోల్‌మాల్ ఫ్రాంచైజీ వంటి సినిమాలతో ఓ ప్రత్యేక గుర్తింపును సాధించాడు.

- Advertisement -

Kalki 2898 AD

అయితే అర్షద్ (Arshad Warsi) వార్సిని తాజాగా యూట్యూబ‌ర్ ఇంట‌ర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కల్కి మూవీపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అర్షద్ వార్సి. అర్షద్‌ మాట్లాడుతూ.. “క‌ల్కి’(Kalki) సినిమా త‌న‌కు న‌చ్చలేద‌ని చెప్పాడు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్ అస‌లే అర్థం కాడు. ఈ వ‌య‌సులో క‌ల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడు. ఆయ‌న‌కు ఉన్న పవ‌ర్‌లో నాకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుంది. అతడు అసాధారణమైన వ్యక్తి. నాకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించింది. అమితాబ్‌ ముందు ప్రభాస్‌ (Prabhas) ఒక జోకర్‌లా కనిపించాడు. అంటూ సినిమా గురించి సంచలమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మంచి ఫైర్ లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు