Prabhas: ఇది కదా టాలెంట్ అంటే.. ఒకే ఏడాదిలో మూడు కాలాలు..!

Prabhas: సాధారణంగా ఎక్కడైనా సరే అద్భుతాలు ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అలాంటి అరుదైన అద్భుతాలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో గా చలామణి అవుతున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ఇటీవలే కల్కి2898AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు అంతకుమించి కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అరుదైన రికార్డును సృష్టించారని చెప్పవచ్చు.. కేవలం సంవత్సర కాలం గ్యాప్ లో భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను చూపించేశారు అని చెబుతున్నారు అభిమానులు, నెటిజెన్లు.. మరి ప్రభాస్ చేసిన అరుదైన రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Prabhas: Isn't this what talent means.. three periods in one year..!
Prabhas: Isn’t this what talent means.. three periods in one year..!

ఒకే ఏడాది 3 కాలాలు..

అసలు విషయంలోకెళితే.. 2023 జూన్లో ఆది పురుష్ సినిమా రిలీజ్ అయింది.. ఇది పాస్ట్ లో జరిగిన రామాయణం కథ. ఆ తర్వాత 2023 డిసెంబర్లో ప్రస్తుతం జరిగే కథతో సలార్ సినిమాను చూపించారు.. 2024 జూన్ లో కలియుగం చివరిలో ఎలా ఉంటుంది అని భవిష్యత్తు చూపించేశారు.. ఇలా ఒక సంవత్సరం గ్యాప్ లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూపించేశారు ప్రభాస్.. ఇలా ఒక్క సంవత్సరం గ్యాప్ లో మూడు డిఫరెంట్ కథలను తీసుకురావడం కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైందని.. అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. ఇక ప్రభాస్ వరుస సినిమాలతో.. రాబోయే సినిమాలతో ఫుల్ ట్రెండ్ లో ఉన్నాడు..ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ ప్రభాస్ హవా కొనసాగుతోంది.. స్టార్ హీరో అయి ఉండి కమర్షియల్ సినిమాలు చేయకుండా ఇలా ప్రయోగాలతోనే కమర్షియల్ గా సినిమాలు చేయడం ఒక్క ప్రభాస్ కే చెందింది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకే ఏడాది గ్యాప్ లో ఇలా మూడు కాలాలకు సంబంధించిన సినిమాలను చూపించి అరుదైన రికార్డు సృష్టించారు.

ప్రయోగాలు చేయడంలో ప్రభాస్ దిట్ట..

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు.. బాహుబలి నుంచి అన్నీ కూడా పాన్ ఇండియా సినిమా కథలను ఎంచుకుంటున్నాడు.. ఒకవైపు కమర్షియల్ అంశాలు జోడించి ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇకపోతే బాహుబలి లో పీరియాడిక్ స్టోరీ చూపించిన ప్రభాస్ సాహోలో స్టైలిష్ యాక్షన్ చూపించారు. రాధే శ్యామ్ లో పీరియాడిక్ లవ్ స్టోరీ చూపించారు.. ఆది పురుష్ లో నాటి త్రేతాయుగం లో రాముడి కథ చూపించగా.. సలార్ లో యాక్షన్ చూపించి.. ఇప్పుడు కల్కిలో భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపించారు. ఇలా ప్రతి సినిమాకి కూడా సరికొత్తగా వస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకే అందరి హీరోలాగా కాకుండా.. కొత్తగా ఆలోచించి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.రాబోయే స్పిరిట్, ది రాజా సాబ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారు.. ఏది ఏమైనా విభిన్నమైన కథలతో కమర్షియల్ హంగులు జోడిస్తూ భారీ సక్సెస్ సొంతం చేసుకుంటున్నారు ప్రభాస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు