Prabhas: ప్రభాస్ ఆ తప్పు చేసి 21 ఏళ్ళు అవుతుంది

Prabhas: ప్రతి హీరో కెరియర్ లో కూడా ఎన్నో హిట్ సినిమాలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఎవరికో రావాల్సిన అవకాశం మనకు వస్తుంది. ఇంకొన్నిసార్లు మనకు రావాల్సిన అవకాశం ఇంకెవరికి దక్కుతుంది. ఇకపోతే చాలామంది వదులుకున్న సినిమాలు మిగతా వారిని స్టార్ హీరోలను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇకపోతే అలా ప్రభాస్ వదులుకున్న ఒక సినిమా ఎన్టీఆర్ ని స్టార్ట్ చేసింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా సింహాద్రి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన మాస్ యాంగిల్ ని బయటికి తీసిన సినిమా సింహాద్రి.

ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే కాకుండా రాజమౌళికి కూడా ఈ సినిమా పెద్ద ప్లస్ అయింది. ఇకపోతే ఈ సినిమా మొదట ప్రభాస్ తో తీయాలి అని రాజమౌళి భావించారట అదే విధంగా కథను కూడా ప్రభాస్ కు చెప్పారు. కానీ ఆ టైంలో ప్రభాస్ ఎందుకు ఈ సినిమాను ఒప్పుకోలేదు. అయితే ఇదే సినిమా ప్రీమియర్ కి ప్రభాస్ ను ఇన్వైట్ చేశాడు రాజమౌళి. అయితే ఆ టైంలో ప్రభాస్ రాజమౌళితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటే రాజమౌళి వచ్చి ప్రభాస్ ని పలకరించారు.

ఇక సింహాద్రి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు రాజమౌళి. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ అయింది. ఆ రోజుల్లో ఈ సినిమా ఒక సంచలనమని చెప్పొచ్చు. ఈ సినిమాను తరువాత తమిళంలో గజేంద్రగా కన్నడలో కంఠీరవ, బంగ్లాదేశ్‌లో బెంగాలీలో దుర్దోర్షో గా రీమేక్ చేయబడింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా తక్కువ ఏజ్ లోనే మాస్ కమర్షియల్ హీరో అయిపోయాడు ఎన్టీఆర్. ఈ కథని బాలకృష్ణ కథానాయకునిగా బి.గోపాల్ దర్శకత్వంలో సినిమాగా తీద్దామని అనుకున్నారు. కానీ వారు వేరే కథను ఎంచుకోవడంతో దొరైస్వామిరాజా నిర్మాతగా ఈ సినిమా తీస్తానని ముందుకువచ్చారు. దాంతో జూనియర్ ఎన్.టి.ఆర్. కథానాయకునిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయింది.

- Advertisement -

Simhadri

ఇప్పటికీ ఎన్టీఆర్ కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ లిస్టు తీస్తే ఈ సినిమా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు కూడా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకి నేటితో 21 ఏళ్ళు. దీనినే కొంతమంది డిఫరెంట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ ఈ కథను ఒప్పుకోకుండా తప్పు చేసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అంటూ రాసుకొస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు