Kalki 2898AD: కల్కి నుంచి ఫోటోస్ లీక్.. వీటి వల్ల అయినా గట్టెక్కుతాడా..?

రెబల్ స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ప్రకటిస్తూ అభిమానులకు మంచి శుభవార్త తెలిపారని చెప్పాలి.. ఈ క్రమంలోని ప్రభాస్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కల్కి 2898AD.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. ప్రస్తుతం కీలక సన్నివేశాలను మేకర్స్ తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమాలోని ఒక సీన్ కి సంబంధించిన ఫోటోలు సెట్ నుంచి లీకయ్యాయి.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి చిత్ర బృందం సిద్ధమైంది. మొత్తం ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతోందని.. అందులో మొదటి భాగం షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ కాగా… ఇప్పుడు రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.. ఈ సమయంలోనే షూటింగ్స్ పార్ట్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడం జరిగింది ఇకపోతే మరోవైపు ఈ సినిమా టీజర్ ను అమెరికాలో అత్యధికంగా పాల్గొనే ది సూపర్ బౌల్ ఈవెంట్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇందులో దీపికా పదుకొనే , దిశా పఠానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ,రాజమౌళి ,రానా, దుల్కర్ సల్మాన్ ,విజయ్ దేవరకొండ , నాని , మృణాల్ ఠాకూర్ తదితరులు నటిస్తున్నారు.. భారీతారాగణం తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుంది అనేది చూడాలి..మరొకవైపు ఈ సినిమా నుంచి ఆసక్తికర ఫోటోలు లీక్ అవడంతో అంచనాలను పెంచేస్తోందని చెప్పవచ్చు.. ఇకపోతే సాధారణంగా సినిమా నుంచి ఏవైనా దృశ్యాలు బయటకి వస్తే సినిమాపై హైప్ పెరుగుతుంది.

- Advertisement -

అయితే ఇది అన్ని సందర్భాలలో జరగదని చెప్పాలి.. ఎందుకంటే వరుసగా సినిమా సెట్ నుంచి లీకులు జరిగితే సినిమాపై ఆసక్తి కూడా పోతుంది.. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్ మూవీ నుంచి ఇలా సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు లీక్ అవడంతో ప్రభాస్ ఈ సినిమాతో గట్టెకుతాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు భారీ తారాగణం నటిస్తోంది కాబట్టి సక్సెస్ అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు