MathuVadalara2 : ఈవిడేంట్రా ఇంతుంది… హీరోయిన్ ని చూసి షాకైన ప్రభాస్..

Mathu Vadalara2 : టాలెంటెడ్ హీరో శ్రీ సింహ (Sri Simha) – కమెడియన్ సత్య పాత్రల్లో తెరకెక్కిన కామెడీ సినిమా “మత్తు వదలరా2″. ఐదేళ్ల కింద వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మత్తు వదలరా కి సీక్వెల్ గా “మత్తు వదలరా2” (Mathu Vadalara2) తెరకెక్కడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాగా మత్తువదలరా2 ట్రైలర్ ని రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఉదయం ప్రభాస్ తో చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ ని లాంచ్ చేయించడం జరిగింది. కాగా ట్రైలర్ లాంచ్ ని కూడా సరదాగా సినిమా స్టైల్ లోనే లంచ్ చేయగా, చిత్ర యూనిట్ తో ప్రభాస్ కూడా సెటైర్లు వేసాడు.

Prabhas launched the trailer of Madhuvadalara 2

ఫరియాని చూసి షాకైన ప్రభాస్..

ఇక మత్తు వదలరా2 ట్రైలర్ ని ప్రభాస్ (Prabhas) రిలీజ్ చేయగా, ట్రైలర్ లాంచ్ చేసేటపుడు ఫన్ గా వీడియో తీశారు మేకర్స్. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాక, సత్య(Satya), శ్రీ సింహ తమ కామెడీ చేష్టలతో ఫన్ పుట్టించారు. ఇక ప్రభాస్ కూడా వాళ్ళతో పాటు కామెడీ చేసారు. ట్రైలర్ ని లాప్ టాప్ లో రిలీజ్ చేస్తుంటే బఫరింగ్ అవుతుంటే, “ట్రైలర్ వచ్చే లోపు పాట పాడనా సార్” అంటూ ఫరియా అబ్దుల్లా లేచి నిల్చుంటుంది. ఒక్కసారిగా షాకైన ప్రభాస్ ఫరియాని చూసి “ఈవిడేంట్రా ఇంతుంది” అనేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ తర్వాత ట్రైలర్ ఇంతకీ రిలీజ్ కాకపోవడంతో మేకర్స్ వీడియో ఎక్కడికెళ్ళిపోయింది అంటూ ఉండగా, ట్రైలర్ నా దగ్గర ఉందని షాకిస్తాడు ప్రభాస్. మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్… అంటే, “తస్కరించా” అంటాడు. ప్రభాస్ లాంచ్ చేసిన ఈ వీడియో కూడా నెట్టింట ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్…

ఇక మత్తు వదలరా2 లో ఫిమేల్ లీడ్ గా ఫరియా అబ్దుల్లా (Faria Abdulla) నటించిన విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. ట్రైలర్ లో శ్రీ సింహ, సత్య తమ కామెడీతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెంచేశారు. ఫస్ట్ పార్ట్ దర్శకుడు రితేష్ రానాయే (Ritesh Rana) సెకండ్ పార్ట్ కి కూడా దర్శకత్వం వహించగా, క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ వారు సంయక్తంగా తెరకెక్కించడం జరిగింది. ఇక మత్తు వదలరా2 సినిమాకు యూ/ఏ (U/A) సెన్సార్ సర్టిఫికెట్ రాగా, సెప్టెంబర్ 13న సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఫస్ట్ పార్ట్ లాగే థియేటర్లలో ఈసారి ఆడియన్స్ ని ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు