Prabhas: బహుశ ప్రభాస్ అభిమానులు కూడా చూడరేమో,చాలా సినిమాలు ఉండగా ఆ సినిమానే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారు.?

Prabhas: రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మొదలైన ఈ ట్రెండ్, అద్భుతంగా ముందు కొనసాగుతుంది.అయితే ముందుగా ఒక్కడు(Okkadu) సినిమాను రీ రిలీజ్ చేశారు ఆ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత పోకిరి(Pokiri) సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాను ఫ్యాన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు(Thammudu) సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. అలానే జల్సా సినిమాను కూడా రిలీజ్ చేశారు. జల్సా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంజయ్ సాహు క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపించిన విధానం. త్రివిక్రమ్(Trivikram) డైలాగ్స్. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మ్యూజిక్. ఇవన్నీ కూడా సినిమాకి ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అని మనకు తెలియంది కాదు. మళ్లీ జల్సా సినిమా రిలీజ్ వైబ్ ను ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్.

 Eswar

- Advertisement -

ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) నటించిన ఆరెంజ్(Orange) సినిమాను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ నటించిన చత్రపతి, అల్లు అర్జున్ నటించిన దేశముదురు(Desamudhuru), ఎన్టీఆర్(Ntr) నటించిన సింహాద్రి(Simhadri) సినిమాలను కూడా రిలీజ్ చేశారు అయితే వీటికి అనుకున్న ఫలితం మాత్రం రాలేదని చెప్పాలి. ఇక ప్రభాస్ నటించిన ఈశ్వర్(Eswar) సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై చాలామంది ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ, ప్రభాస్ కెరియర్ లో చాలా హిట్ సినిమాలు ఉండగా ఈ సినిమాను ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారు, బహుశా ఈ సినిమాను ప్రభాస్ అభిమానులు కూడా చూడరేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు