Prabhas: దేశం దాటిన ప్రభాస్ ఫాలోయింగ్.. పాకిస్తాన్ నటితో మూవీ..!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో భారీ పాపులారిటీ దక్కించుకొని, ఇప్పుడు కల్కి 2898 AD సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నారు. నిజానికి ఇండియన్ యాక్టర్ అయినప్పటికీ విదేశాలలో కూడా ఈయన తన మార్కెట్ పెంచుకోవడం గమనార్హం ముఖ్యంగా చైనా, అమెరికా, జపాన్, కొరియా , ఇంగ్లాండ్, గల్ఫ్, ఆస్ట్రేలియా దేశాల్లో తన మార్కెట్ ను ఒక రేంజ్ లో పెంచుకున్నారని చెప్పవచ్చు. అందుకే ప్రభాస్ సినిమా అంటే ఒక్క ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు గ్లోబల్ మార్కెట్ కూడా ఎదురుచూస్తుంది. అంతలా పేరు సొంతం చేసుకున్నారు ప్రభాస్.

Prabhas: Prabhas following across the country.. Movie with Pakistani actress..!
Prabhas: Prabhas following across the country.. Movie with Pakistani actress..!

పాకిస్తాన్ ముద్దుగుమ్మ తో ప్రభాస్ రొమాన్స్..

ఇకపోతే విదేశాలలో పేరు దక్కించుకున్న ప్రభాస్ దాయాది దేశమైన పాకిస్తాన్ మార్కెట్లో మాత్రం అడుగుపెట్టలేదు. అందుకే పాకిస్తాన్లో కూడా నటించాలని అభిమానులు భావిస్తున్నారు. కానీ పాకిస్థాన్లో మార్కెట్ పరిమితమైనది కాబట్టి దీనిని ఎవరు కూడా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపించలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దాయాది దేశమైన పాకిస్తాన్ కు చెందిన పాపులర్ హీరోయిన్ సజల్ అలీ నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే రాజా సాబ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ , హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పాకిస్తాన్ నటి సజల్ అలీ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దివంగత నటి శ్రీదేవి నటించిన మామ్ చిత్రం ద్వారా ఈ ముద్దుగుమ్మ తన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఇందులో శ్రీదేవి కూతురుగా నటించే సమయంలో సజల్ అలీ తల్లి మరణించడంతో శ్రీదేవిని తల్లిగా భావించింది. అందుకే ఈమెను శ్రీదేవి మూడో కూతురు అని అందరూ చెబుతూ ఉంటారు.

పాకిస్తాన్ పై ప్రభాస్ కన్ను..

ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె ఇటీవల పరిచయమైంది. కాబట్టి ఈమెను హీరోయిన్గా తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట.మరి ఇందులో ఎంపిక అయిందా? లేదా? అనేది ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ అందగత్తెలైన దీపికా పదుకొనే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , శ్రద్ధా కపూర్, ఈవ్ లిన్ శర్మ తదితర నటీమణులతో నటించారు. కానీ ఇంకా పాకిస్తాన్ వైపు తొంగి చూడలేదు. కానీ ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ ముద్దుగుమ్మతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

- Advertisement -

ప్రభాస్ మూవీ కోసం విశాల్ చంద్రశేఖర్..

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం సీతారామం తర్వాత స్వరకర్త విశాల్ చంద్రశేఖర్ హను రాఘవపూడి తో కలిసి పని చేయనున్నారు.

ప్రభాస్ సినిమాలు..

ప్రస్తుతం మారుతీతో రాజా సాబ్ విడుదలపై ఫోకస్ చేసిన ప్రభాస్.. తదుపరి హను రాఘవపూడితో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారట. అలాగే ప్రశాంత్ నీల్ తో సలార్ 2 సినిమా వచ్చే యడాది ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నాగ్ అశ్విన్ తో కల్కి 2898AD సీక్వెల్ కూడా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు