Prabhas : ఫ్రెండ్‌షిప్ కోసం రూ.40 కోట్లు వదులుకున్న ప్రభాస్… రాజు ఎప్పటికైనా రాజే అంటున్న ఫ్యాన్స్

Prabhas..టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవలే నటించిన కల్కి 2898AD సినిమా గత నెలలో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. సుమారుగా ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్నది.మరికొద్ది రోజులలో కల్కి సినిమా బజ్ కాస్తా అయిపోతుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆయన నుంచే వచ్చే నెక్స్ట్ సినిమా ఏంటనే విషయం పైన ఆరా తీస్తూ ఉంటారు. ఇకపోతే ప్రభాస్ తన తదుపరి చిత్రం డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ సినిమానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు.

Prabhas: Prabhas gave up Rs. 40 crores for friendship... fans say Raju is always Raju
Prabhas: Prabhas gave up Rs. 40 crores for friendship… fans say Raju is always Raju

త్వరలో రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్..

ఇప్పటికే రాజా సాబ్ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం వరకు పూర్తి అయినట్లు తెలియజేశారు. హర్రర్ కామెడీ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ మారుతి.. కేవలం పోస్టర్లను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేశారు. డైరెక్టర్ మారుతి కెరియర్ లోని మొదటిసారి ఒక స్టార్ హీరో చిత్రాన్ని డీల్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల రూపాయల బడ్జెట్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు కేటాయించారు. అయితే ఇందులో ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ.125 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ రాజా సాబ్ సినిమా బడ్జెట్లో సగం వరకు ప్రభాసే తీసుకునేలా కనిపిస్తున్నారు.

ప్రభాస్ ఫస్ట్ లుక్ వైరల్..

ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా ఒకే ప్యాలెస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో చిత్ర బృందం పెద్దగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను మాత్రమే విడుదల చేశారు. గతంలో కూడా ఎన్నో చిత్రాలలో ప్రభాస్ కామెడీ సన్నివేశాలలో అదరగొట్టేశారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

- Advertisement -

ఫ్రెండ్షిప్ కోసం రూ.40+ కోట్లు నష్టం.

అయితే మరోవైపు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ప్రభాస్ 125 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కాకుండా కేవలం రూ.71 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి ప్రభాస్ ఇలా చేయడానికి కారణం ఏమిటంటే.. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా అని అన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే ఆది పురుష్ సినిమాను రూ.166 కోట్లకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిజాం హక్కులు కొనుగోలు చేసింది.. కానీ ఈ సినిమాకి రూ.120 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రూ.46 కోట్లు పీపుల్స్ మీడియా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఆది పురుష్ సినిమాకి అంత కెపాసిటీ లేదని తెలిసినా కూడా రూ m166 కోట్లు పెట్టి ఎందుకు తీసుకున్నారు అని అడిగితే.. ప్రభాస్ తో మాకు బాండింగ్ అవసరం.. అందుకే మేము డబ్బులు గురించి ఆలోచించకుండా ఆది పురుష్ నిజాం రైట్స్ తీసుకున్నానని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తెలియజేశారు.

నష్టాలను భర్తీ చేసిన రాజు.

అప్పటినుంచి ప్రభాస్ కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మధ్య బాండింగ్ బాగా కుదిరిందట. ఇక ఇప్పుడు ఆ బాండింగ్ తోనే మారుతి డైరెక్షన్ లో చేసే సినిమాకు నిర్మాతగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారికి అవకాశం కల్పించారు.. అంతేకాదు ఆది పురుష్ సినిమా ద్వారా 46 కోట్లు నష్టపోయిన పీపుల్ మీడియాకి తన రెమ్యూనరేషన్ లో ఈ మొత్తాన్ని తగ్గించుకోబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఆది పురుష నష్టాలను భర్తీ చేయడానికి, రాజా సాబ్ సినిమా కోసం తక్కువ పారితోషకం తీసుకున్నారు ప్రభాస్. ఏది ఏమైనా ఫ్రెండ్షిప్ కోసం రూ.40 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోసం, ఏకంగా తన పారితోషకాన్ని తగ్గించుకొని రాజు ఎప్పటికైనా రాజే అని నిరూపించారు ప్రభాస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు