Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో కిక్ ఇచ్చే న్యూస్… థమన్ రంగంలోకి దిగాడండోయ్

Prabhas : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి2898AD ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తుండగా, ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్లలలో మరో రెండు వారాలు బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. అందులోనే ప్రభాస్ రిలాక్స్ మోడ్ లో ఉండి వెకేషన్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇక గత రెండేళ్లుగా ప్లాప్ లతో సతమతమైన ప్రభాస్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో సలార్ తో తన సత్తా చూపించాడు. ఇప్పుడు సరికొత్త జోష్ తో కల్కి సినిమాతో పాన్ ఇండియా రికార్డులు తిరగరాయడానికి వస్తున్నాడు. ఈ సినిమా ఇప్ప్పటికే బుకింగ్స్ లో రికార్డులు తిరగరాస్తూ రచ్చ చేస్తుంది. దాదాపు మొదటి రోజు రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఇక కల్కి షూటింగ్ టైం లోనే మధ్యలో రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొన్నాడు ప్రభాస్. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ 80 శాతానికి పైగా పూర్తయిందట. పైగా ప్రభాస్ లేనప్పుడు మారుతి టైం వేస్ట్ చేయకుండా ఇతర నటీనటులతో మిగతా సీన్లు షూట్ పూర్తి చేసాడు. ఇదిలా ఉండగా రాజా సాబ్ నుండి ఫ్యాన్స్ కి మరో క్రేజి అప్డేట్ వచ్చింది.

Prabhas 'Rajasaab' movie latest update from Thaman

రంగంలోకి దిగిన థమన్…

ఇక రాజా సాబ్ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాబట్టి సాంగ్స్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇకపోతే రాజా సాబ్ సినిమా నుండి మ్యూజిక్ విషయమై ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కి మ్యూజిక్ థమన్ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. తాజాగా థమన్ రాజాసాబ్ కోసం మ్యూజిక్ సిట్టింగ్ వేసాడని డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో దాదాపు ఆరు పాటలుంటాయట. హీరోయిన్లతోనే నాలుగు సాంగ్స్ ఎంటర్టైనింగ్ గా మాస్ బీట్స్ తో ఉంటాయని సమాచారం. ఇక ప్రభాస్ (Prabhas) చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమాలో మాస్ స్టెప్స్ వేయబోతున్నాడట. డార్లింగ్ ప్రభాస్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా మిస్ అయింది డాన్స్ నే. రాజాసాబ్ తో ఆ లోటు థమన్ తీర్చేస్తాడని సమాచారం. ఇప్పటికే మూడు సాంగ్స్ రెడీ చేయగా, ట్యూన్స్ లో కొత్తరకం ట్రై చేస్తూ మారుతీ థమన్ సెట్టింగ్ వేశారు.

- Advertisement -

డార్లింగ్ లేకున్నా పని ఆగట్లేదు..

ఇక ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ లకి రిలాక్స్ కోసం కాస్త బ్రేక్ ఇచ్చాడు. కల్కి రిలీజ్ అయిన రెండు వారాలకి సెట్స్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే ప్రభాస్ లేకున్నా మారుతీ సినిమా పనుల్లో వేగం పెంచాడు. ఇక ఆ మధ్య షూటింగ్ లో స్టిల్స్ లీక్ కాగా, ఇప్పుడు పగడ్బందీగా సినిమాకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా ప్లాన్ చేస్తున్నాడు మారుతీ. అలాగే ప్రభాస్ లో చాలా ఏళ్లుగా మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ని మాత్రం ఫ్యాన్స్ కి పక్కా గా అందిస్తానని మారుతీ పలు ఇంటర్వూ లలో చెప్పాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా లో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, అలాగే నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రాజా సాబ్ లో జిష్షు సేన్ గుప్త, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి కీ రోల్స్ లో నటిస్తున్నారు. కల్కి రిలీజ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు