Prabhas : అద్భుతమైన కాన్సెప్ట్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం కాంతారా. ఈ సినిమా సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అతి తక్కువ సమయంలోనే భారీగా వసూళ్లు  సాధించి కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను రికార్డులను చెరిపివేసింది. కేజీఎఫ్ లాంటి సంచలనాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కర్ణాటకలో అతిపెద్ద విజయం సాధించడంతో ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. 

తాజాగా తెలుగులో కూడా విడుదల అయింది. ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాను చూసిన ప్రభాస్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్ చేశాడు. ఈ చిత్రం తనను చాలా ఇంప్రెస్ చేసిందని, అందుకే కాంతారా సినిమాను  రెండు సార్లు చూసినట్టు తెలిపారు. ఈ సినిమా ద్వారా ప్రత్యేక కాన్సెప్ట్ తెలియజేశారని ప్రశంసించారు ప్రభాస్. 

హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమా కాంబ్లా, బూటాకోలా సంప్రదాయ, సంస్కృతిని తెలియజేస్తుంది. కాంతారా సినిమా వాస్తవానికి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అదేవిధంగా థ్రిల్లింగ్ క్లైమాక్స్. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలని చెప్పుకొచ్చారు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ చిత్రాన్ని కూడా హోంబలే ఫిల్మ్ నిర్మిస్తోంది.  ఇక ఈ చిత్రంలో హీరోయిన్ సప్తమి గౌడ,  కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రకాశ్ తుమినాడ్, ప్రమోద్ శెట్టి వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో అక్టోబర్ 20న విడుదల కానుంది. హిందీలో అక్టోబర్ 14న విడుదల అయింది. తెలుగులో అక్టోబర్ 15న విడుదల అయింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన భాషల్లో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు