Kalki2898AD : జక్కన్న చెప్పిందే నిజం చేసిన నాగి.. వేరొకర్ని ఊహించలేమా? ఎందుకు?

Kalki2898AD : పాన్ ఇండియా వైడ్ గా ఇప్పుడు కల్కి హవానే నడుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD మూవీ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి అసలు సిసలు రోల్ పడిందంటూ అభిమానులు ఖుషి అయిపోతున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా చాలా రోజుల తర్వాత వైవిధ్యమైన పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక కమల్ హాసన్ కనిపించింది కొద్దీ సేపే అయినా ఆ రోల్ లో జీవించారు. ప్రేక్షకుల్ని భయపెట్టేలా ఆ పాత్ర ఉంది. ఇక థియేటర్లలో ప్రీమియర్స్ నుండే ప్రేక్షకాభిమానులు థియేటర్ల వద్ద రచ్చ చేస్తుండగా, ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ తో కామన్ ఆడియన్స్ థియేటర్లకు తరలి వస్తున్నారు. దాదాపు టాలీవుడ్ లో మూడు నెలల తర్వాత థియేటర్లు హౌస్ ఫుల్ అవడం పట్ల సినీ ప్రియులు, థియేటర్ యాజమాన్యాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే క్లైమాక్స్ లో ప్రభాస్ ని ఊహించని విధంగా రెండో రోల్ ని రివీల్ చేసి సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్.

 

జక్కన్న చెప్పింది నిజం చేసిన నాగి…

అయితే కల్కి సినిమాలో ప్రభాస్ ని భైరవ గా చూసిన అభిమానులు, కల్కి భగవానుడిగా కూడా ప్రభాస్ నే చూపిస్తారని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ప్రభాస్ ని మహాభారతం లో అద్భుతమైన పాత్రలో చూపించి షాకిచ్చాడు నాగ్ అశ్విన్. ఇక ఆ రోల్ లో చూసిన ప్రభాస్ అభిమానులు మైమరిచిపోతున్నారు. ప్రేక్షకులు కూడా ప్రభాస్ కి ఆ రోల్ సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. అయితే అంతటి ప్రతిష్టాత్మకమైన పాత్ర ప్రభాస్ కే సూట్ అవుతుందని చాలా రోజుల కిందే దర్శక ధీరుడు రాజమౌళి చెప్పడం జరిగింది. ఆ పాత్రనే ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరపై నిజం చేసాడు. బహుశా రాజమౌళి సూచనతోనే ప్రభాస్ ని ఆ రోల్ లో నాగ్ అశ్విన్ చూపించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

రాజమౌళి ఎప్పుడో చెప్పేసాడు..

కల్కి (Kalki2898AD) సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ ని చూపించిన ఆ రెండో రోల్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ ట్విస్ట్ ని ప్రేక్షకులు ఎవరూ గెస్ చేయలేదని చెప్పాలి. కానీ రాజమౌళి మాత్రం తాను మహాభారతం తీస్తే ఆ రోల్ ని ప్రభాస్ కే ఇస్తానని, తనైతేనే బాగుంటాడని చాలా రోజుల కిందట జక్కన్న ఓ వేదికపై చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కల్కి సినిమా చూసిన వారు ప్రభాస్ ఆ పాత్రలో జీవించేసాడని, ఆ పాత్రకి తానే సరిపోతాడని అంటున్నారు. అయితే సినిమా చూడని వారికోసం ఆ రోల్ ఏంటో చెప్పి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ని తగ్గించాలని అనుకోవడం లేదు. సినిమా చూడని ప్రభాస్ అభిమానులు నేరుగా థియేటర్లలో చూసి సప్రైజ్ అయితే థ్రిల్ అయిపోతారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండని అర్జునుడిగా చూపించాడు నాగ్ అశ్విన్. అయితే మహాభారతంలో కీలకమైన అభిమన్యుడు, భీముడు, భీష్ముడు, ద్రోణాచార్య తదితర పాత్రల్ని ఎక్కడా చూపించలేదు. బహుశా రెండో పార్ట్ లో ఏమైనా చూపిస్తాడా? లేక ఈ పాత్రలతోనే కథని కొనసాగిస్తాడా అనేది చూడాలి.

Prabhas' second role in Kalki2898AD was revealed earlier by Rajamouli

వేరొకర్ని ఊహించలేమా?

అయితే ప్రభాస్ ని కల్కి లో చూపించిన ఆ రెండో పాత్ర ఎంతో వైవిధ్యాన్ని కూడుకుని ఉంటుంది. ఆ పాత్రని పోలిన లక్షణాలున్న పాత్రనే ప్రభాస్ బాహుబలిలో చేసాడు. ఆ సినిమాలో ప్రభాస్ త్యాగ శీలిగా, మాట కోసం దేన్నయినా త్యాగం చేసేలా, ప్రాణం పోయినా మాట తప్పని యోధుడిగా చూపించారు. ముఖ్యంగా బాహుబలిలో ప్రభాస్ పాత్ర ప్రేమ, కరుణ ఉన్న అమరేంద్ర బాహుబలిని పోలి కల్కి లో ప్రభాస్ సెకండ్ రోల్ లో ఉంటుంది. అప్పట్లో బాహుబలిలో ప్రభాస్ ని చూసిన ఫ్యాన్స్, మహాభారతం లో ఈ పాత్రకే ప్రభాస్ సరిపోతాడని ఫ్యాన్స్ ఊహించుకున్నారు. అదే ఇప్పుడు నాగ్ అశ్విన్ నిజం చేసాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు