Kalki 2898 AD : గోపిచంద్ వద్దు అని చెప్పినా ఈ సినిమా చేసా… ప్రభాస్ షాకింగ్ కామెంట్

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. తన అద్భుతమైన నటనకి గాను కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ కి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి అనంతరం వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

ఇటీవలే ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి, ఈ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ అంతా బిజీగా ఉంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నా.డు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా రూపంలో తెరకెక్కనుంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా చేసిన కల్కి సినిమా ఈ నెల చివర్లో రిలీజ్‌ కాబోతుంది.

అయితే.. ఈ తరుణంలోనే.. గోపిచంద్‌ ను ఉద్దేశించి.. ప్రభాస్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. గోపిచంద్ వద్దు అని చెప్పినా కల్కీ లాంటి సినిమా చేసానని ప్రభాస్ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. గోపిచంద్‌ చేసిన ఓ సినిమా ఈవెంట్‌ లో ప్రభాస్‌ మాట్లాడుతూ… కొత్త రకం సినిమాలు చేయకూడదని గోపిచంద్‌ సూచించేవాడు.. కానీ నేను కొత్త రకం సినిమాలే చేస్తానని చెప్పేవాడిని అంటూ ప్రభాస్‌ చెప్పుకొచ్చారు. ఈ తరుణంలోనే..కల్కి సినిమా ప్రభాస్‌ చేసినట్లు.. ఆ ఫ్యాన్స్‌ దీనికి సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు.

- Advertisement -

List of famous actors who acted in the movie Kalki2898AD
కాగా, ప్రభాస్ హీరో గోపీచంద్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరికొకరు చాలా సహాయాన్ని చేసుకుంటూ సొంత సోదరుడి లాగా ఉండేవారు. ఇదిలా ఉండగా…. వర్షం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. ఆ సినిమా అనంతరం హీరో అవ్వాలని అనుకొని ప్రభాస్ కి చెప్పారట. దీంతో ప్రభాస్ కొంతమంది డైరెక్టర్స్ ని గోపీచంద్ కి పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రభాస్ అన్నయ్య ప్రబోద్ యువి క్రియేషన్స్ ప్రారంభించినప్పుడు ఆ బ్యానర్లో పలు సినిమాలు చేశారు. ఇక అప్పుడు గోపీచంద్ కెరీర్ హీరోగా మలుపు తిరిగింది.

https://x.com/GetsCinema/status/1804132359962329337

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు