Prabhas: పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ.. ఆ సమస్యే వెంటాడుతోందా..?

Prabhas.. రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా కల్కి 2898 ఏడి అనే చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఇప్పటికే సినిమా ట్రైలర్, ఈవెంట్స్ కి మంచి రెస్పాండ్ లభించింది.. మరోవైపు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో రూ.390 కోట్లు దాటేసింది. పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో టికెట్ ధర పెంపుకు ప్రభుత్వాలు కూడా అంగీకరించడంతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ మీద రూ.75 .. మల్టీ స్క్రీన్ మీద రూ .120 పెంచేశారు.. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు.. పైగా ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభాస్ ఈ సినిమాతో భారీ రికార్డులు క్రియేట్ చేస్తారని అభిమానుల సైతం అనుకుంటున్నారు.. ఇంతటి సంతోషకర సమయంలో సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రభాస్ అభిమానులను బాధపెడుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

లోపల భరించలేని బాధ.. కానీ పైకి చిరునవ్వు..

Prabhas: Smiling up and suffering inside.. is that problem haunting you..?
Prabhas: Smiling up and suffering inside.. is that problem haunting you..?

తాజాగా ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.. దీనికి చిత్రబృందం అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకునే తో పాటు నిర్మాత అశ్వినీ దత్ కూడా హాజరయ్యారు.. ఈవెంట్లో ప్రభాస్ చాలా ఫన్నీగా నవ్వుతూ .. సంతోషంగా .. యాక్టివ్గానే కనిపించారు.. ముఖ్యంగా ప్రభాస్ ను అమితాబ్ ఆటపట్టించడం చూసి.. అభిమానులు సైతం మురిసిపోయారు.. ఇలాంటి సమయంలో అభిమానులను ఆందోళన చెందేలా ఈ ఈవెంట్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టేజ్ మీద దీపికా పదుకొనే పక్కన ప్రభాస్ నిల్చొని ఉన్నారు.. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ సమయంలో ఒక్క క్షణం ఆయన వెనక్కి తుళ్ళిపడ్డారు.. ఫేసులో ఆ క్షణం భరించలేని బాధ. కానీ వెంటనే నవ్వుతూ కవర్ చేసేసారు ప్రభాస్.. ఇక ఇప్పుడు ఈ వీడియో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో ఫ్యాన్స్..

ఈయన కాలి గాయం ఇంకా నయం అవ్వలేదని తెలుసుకొని రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. ప్రభాస్ అన్న మాకు ఇప్పుడు సినిమా లేవీ వద్దు.. ముందు నువ్వు ఆరోగ్యం చూసుకో అంటూ ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

సర్జరీ జరిగినా కూడా తగ్గని గాయం..

ఇకపోతే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో మొదటిగా ప్రభాస్ కాలికి గాయం అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అలాగే సాహో , సలార్ సినిమా సమయంలో కూడా ఆయన కాలికి గాయం అయింది.. సర్జరీ కూడా చేయించుకున్నారు.. రెండు నెలల విశ్రాంతి తర్వాత కల్కి సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.. అయినా కూడా సెట్ అవ్వలేదని అభిమానులు చెబుతున్నారు.. మరోసారి యూరప్ వెళ్లి సర్జరీ చేయించుకుంటారని కూడా వార్త నడుస్తోంది. ఇక సర్జరీ తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే బయటికి సంతోషంగా ఉన్నా.. లోపల మాత్రం ఆ బాధను అనుభవిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు