Prabhas: ప్రభాస్ తల్లి శివ కుమారిలో ఇంత గొప్ప టాలెంటా.. ఫ్యాన్స్ ఫిదా..!

Prabhas.. టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి2898AD చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ .900 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కల్కి 2898AD సినిమాతో నెక్స్ట్ లెవెల్ లో ప్రభాస్ నటనపరంగా ముందుకు వెళ్లారని చెప్పవచ్చు. అభిమానులు కూడా పార్ట్-2 కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ ఇంత స్టార్డం అందుకున్నప్పటికీ ఆయన తల్లి మాత్రం ఎప్పుడూ కూడా మీడియా ముందు అసలు కనిపించరు.

Prabhas: Such a great talent in Prabhas's mother Siva Kumari.. Fans Fida..!
Prabhas: Such a great talent in Prabhas’s mother Siva Kumari.. Fans Fida..!

ప్రభాస్ తల్లిలో అద్భుతమైన టాలెంట్

ప్రభాస్ తండ్రి పేరు సూర్యనారాయణ.. ఈయన చాలా యేళ్ళ క్రితమే మరణించారు.. దీంతో కృష్ణంరాజు కుటుంబంతోనే ప్రభాస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి కూడా ఎక్కువగా మీడియా ముందు ప్రభాస్ గురించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఇక ప్రభాస్ తల్లి విషయానికి వస్తే ఆమె పేరు శివకుమారి.. అయితే ఈమెను అభిమానులు చూడక చాలా సంవత్సరాలు అవుతోంది.. దీన్ని బట్టి చూస్తే అసలు ఆమె ప్రభాస్ నటించిన సినిమాలు చూస్తారా అనే డౌట్ కూడా ఇప్పుడు అభిమానులలో తలెత్తుతోంది. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

శ్యామలాదేవి క్లారిటీ..

కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి మాట్లాడుతూ.. ప్రభాస్ తల్లి శివకుమారి బయట కనిపించకపోయినా.. ఆమెలో చాలా రేర్ టాలెంట్ కూడా ఉన్నది.. సినిమాలు ఎక్కువగా చూస్తుంది.. అంతేకాకుండా ఆ సినిమాలో ఏం బాగుంది..? ఏం బాగాలేదు..? అనే విషయాన్ని కూడా తెలియజేయడమే కాకుండా ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే అది ఎందుకు అయిందని కూడా పక్కాగా చెబుతుంది. ప్రభాస్ విడుదలైన ప్రతి చిత్రానికి కూడా తన తల్లి కోసం ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ను సైతం ఏర్పాటు చేస్తూ ఉంటారట. ఆమె చూసి సినిమా ఎలా ఉందో చెబుతూ ఉంటుంది..

- Advertisement -

శివకుమారి టాలెంట్ కి ఫ్యాన్స్ ఫిదా..

ఎలాంటి విషయాన్ని అయినా సరే ఆమె ముఖం మీద చెప్పేస్తుంది.. ప్రభాస్ తండ్రి కూడా గతంలో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. అలాగే ప్రభాస్ సినిమాలు విడుదలైన సమయంలో ఫాన్స్ ప్రజలు ఎలా మాట్లాడుకుంటారు అనే విషయాలను కూడా ప్రభాస్ తల్లి శివకుమారి తనతో డిస్కషన్ ఎక్కువగా చేస్తూ ఉంటుందని శ్యామలాదేవి తెలియజేశారు. ప్రస్తుతం విడుదలైన కల్కి సినిమా గురించి కూడా ఇద్దరం కలిసి ఒకసారి డిస్కషన్ చేసుకోవాలి అంటూ తెలియజేసింది శ్యామలాదేవి. ప్రస్తుత ప్రభాస్ తల్లి శివకుమారి గురించి ఈ విషయం అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. మొత్తానికి అయితే ప్రభాస్ తల్లి శివకుమారిలో సినిమా ఫలితాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉందని తెలిసి అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె మీడియా ముందుకు రాకపోయినా ఈమె టాలెంట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు