Prabhas: కాలం అలా కలిసొచ్చింది

Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాలో అమితాబచ్చన్ కమలహాసన్ దీపిక పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేశారు.

ఇకపోతే కొందరికి టైం అనేది ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో ఎవరు ఊహించలేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కష్టపడుతూ పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో కిందిస్థాయిలో కెరియర్ స్టార్ట్ చేసిన చాలామంది ఈరోజు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ జీవితంలో కూడా అటువంటి ఆసక్తికరమైన సంఘటన ఒకటి ఉందని చెప్పొచ్చు. కమల్ హాసన్ దర్శకత్వం వహించిన విశ్వరూపం అనే సినిమా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ గా మారింది. కమల్ హాసన్ నటించిన ఆ సినిమాను చాలామంది అప్పట్లోనే అడ్డుకున్నారు. ఈ తరుణంలో కమల్ హాసన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

Kamal Haasan

- Advertisement -

విశ్వరూపం సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కి రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభాస్ ఇలా చాలామంది హాజరయ్యారు. అయితే అప్పుడు ప్రభాస్ మాట్లాడుతూ ఒకసారి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ బహుశా నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు అయాం ప్రభాస్ అంటూ ప్రభాస్ ను పరిచయం చేసుకున్నాడు. అయితే యాదృచ్ఛికంగా ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సినిమాలోని కమల్ హాసన్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. చాలామంది ఈ వీడియోను షేర్ చేస్తూ ఇది కదా సక్సెస్ అంటే అంటూ అప్పటి మాటలను వైరల్ గా మార్చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు