MissShettyMrPolishetty : ఆ సినిమా చేయొద్దని అనుష్కకి ముందే వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్లలో కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి ఒకరు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరితో నటించి టాలీవుడ్ లో అగ్రనటిగా వెలుగొందింది.

ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ దూసుకుపోయింది. అయితే ఒకానొక సమయంలో చాలా బొద్దుగా తయారు కావడంతో పాటు ఆమె వయసు కూడా పెరగడంతో ఆఫర్లు తగ్గాయి. దీంతో అనుష్క భాగమతి సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై ఎక్కడా కనిపించలేదు. ఇదిలా ఉంటే.. చాలాకాలం తర్వాత మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క – నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ – సిల్వర్ స్క్రీన్ స్వీటీ అనుష్క ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలం నుండి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ కూడా పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ ని వాళ్ళు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. కానీ వీరిద్దరూ మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా అనుష్కకి ఓ సినిమా ఆఫర్ వచ్చిన వెంటనే ఆ స్క్రిప్ట్ గురించి వెంటనే ప్రభాస్ కి ఫోన్ చేసి చెప్పిందట అనుష్క. దీంతో ఆ కథ విన్న వెంటనే ఆ సినిమా చేయవద్దంటూ అనుష్కకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట ప్రభాస్.

- Advertisement -

ఆ సినిమా మరేదో కాదు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో అనుష్క ఓ వేశ్య పాత్రలో నటించింది. అయితే స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న అనుష్క ఆ సమయంలో వెండితెరపై ఓ వేశ్యగా కనిపించడంతో ఇక ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయిందని అంతా భావించారు. దీంతో ఇలాంటివేవో జరుగుతాయనే ప్రభాస్ ఈ సినిమా చేయవద్దని అనుష్కని హెచ్చరించారట. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత అనుష్క నటించిన సరోజా పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్వీటీ నటించిన సినిమాలలో ఎప్పటికీ మరిచిపోలేని పాత్రలలో సరోజ పాత్ర కూడా ఒకటిగా నిలిచింది. సరోజ పాత్రని దర్శకుడు క్రిష్ డిజైన్ చేసిన విధానం బాగుందని మళ్లీ అనుష్కకి ఫోన్ చేసి చెప్పాడట ప్రభాస్.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు