Prabhas Watch Collection : ప్రభాస్ వాచ్ కలెక్షన్ తెలిస్తే ఫ్యూజులు ఔట్… వాటి ధరతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ సెట్టు

Prabhas Watch Collection : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లగ్జరీ లైఫ్ కి కూడా కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఆయన దగ్గర ఉన్న కార్ కలెక్షన్ మాత్రమే కాదు వాచ్ కలెక్షన్ చూసినా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మరి ఆయన దగ్గర ఉన్న ఖరీదైన వాచ్ లు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ప్రభాస్

ప్రభాస్ సినిమాల్లోకి రాకముందే రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. ప్రభాస్ ఒరిజినల్ పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. సినిమాల్లోకి వచ్చాక ఆ పేరుని షార్ట్ గా ప్రభాస్ గా మార్చుకున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యనారాయణ రాజు, శివ కుమారిలకు ప్రభాస్ జన్మించారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, అందులో ప్రభాస్ చిన్నవాడు. ప్రభాస్ కు సోదరుడు ప్రబోధ్, సోదరీ ప్రగతి ఉన్నారు. ఇక ఈ హీరోకు రెబల్ స్టార్ కృష్ణంరాజు పెదనాన్న అవుతారన్న విషయం తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. వీరిది రాజుల ఫ్యామిలీ కావడంతో ఎప్పటి నుంచో వందల ఎకరాలకు భూస్వామిగా ఉన్నారు. అలాగే లగ్జరీ లైఫ్ మైంటైన్ చేసేవారు. సహాయం చేయడంలో కూడా ప్రభాస్ ఫ్యామిలీది పెద్ద చేయి అని అంటూ ఉంటారు.

ప్రభాస్ వాచ్ కలెక్షన్

ఇక ప్రభాస్ ధరించే వాచ్ లు కూడా కాస్ట్లీ గానే ఉంటాయి. ప్రభాస్ వాడే హుబ్లక్ సాంగ్ బ్లూ ఆల్ బ్లాక్ వాచ్ ధర 14 లక్షలు. అదే కంపెనీకి చెందిన హుబ్లక్ సాంగ్ బ్లూ వైట్ కూడా ఉంది. ఈ వాచ్ ద్వారా 13 లక్షలు. గతంలో ప్రభాస్ 4 క్షల ఖరీదు చేసే బెల్ అండ్ రాస్ బిఆర్ 03-92 అనే మోడల్ వాచ్ ను పెట్టుకునేవారు. ఇక పాపులర్ బ్రాండ్ అయిన లూయిస్‌ వూట్టాన్‌ టాంబోర్‌ రెగట్టా నేవీ వాచ్ ని కూడా ప్రభాస్ కొన్ని రోజులు వాడారు. దీని కాస్ట్ 3 లక్షల వరకు ఉంటుంది. ప్రభాస్ వాడే వాచ్ లలో దీనిదే అతి తక్కువ ధర. అలాగే ప్రభాస్ దగ్గర అత్యంత కాస్ట్లీ వాచ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటా సిటీ గోల్డ్ వాచ్ కూడా ఉంది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నారు. దీని ధర 26 లక్షలు ఉండడం విశేషం. అలాగే రోలెక్స్ యాచ్ మాస్టర్ లెవెన్ గోల్డ్ వాచ్ ను కూడా ప్రభాస్ పెట్టుకుంటూ ఉంటారు. దీని ధర అక్షరాల 29 లక్షలు. ఇలా ప్రభాస్ దగ్గర ఉన్న వాష్ కలెక్షన్ల అన్ని అన్నింటి ధర కలిపితే దాదాపు కోటి వరకు ఉంటుందని సమాచారం. అంటే ప్రభాస్ వాచ్ లని అమ్మేస్తే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా బతికేస్తుందని చెప్పొచ్చు. ప్రభాస్ దగ్గర కేవలం వాచ్ కలెక్షన్లు మాత్రమే కాదు లగ్జరీ కార్లు, కోట విలువ చేసే ఇల్లు, ఫాం హౌస్ లాంటివి కూడా ఉన్నాయి.

- Advertisement -

కార్ కలెక్షన్

ప్రభాస్ గ్యారేజీలో అత్యంత కాస్ట్లీయస్ట్ కార్లు కొలువుదీరాయి. ఆయన దగ్గర ఉన్న కార్లు, వాటి ధరలు.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ధర రూ. 1 కోటి, బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కారు ధర రూ. 2 కోట్లు, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు ధర రూ. 2 కోట్లు, జాగ్వార్ XJL పోర్ట్ ఫోలియో కారు ధర రూ. 1 కోటి, రోల్స్ రాయల్స్ ఫాంటమ్ కారు ధర రూ.8 కోట్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు