Prabhas: ఎందుకు డార్లింగ్స్ గొడవ ఇద్దరికీ 1000 కోట్లు సినిమాలు ఉన్నాయి. ఇంకో 1000 కోట్లు సినిమా నాకు పడేయండి

Prabhas: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఏ లెవెల్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఇండస్ట్రీ నుంచి దర్శకులు కూడా వచ్చి తెలుగు హీరోలతో పని చేయడానికి ఇష్టపడుతున్నారు. అలానే మిగతా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కూడా తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. మలయాళం లో స్టార్ హీరోగా గుర్తింపు సాధించుకున్న దుల్కర్ సల్మాన్ ఇదివరకే తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామ అనే సినిమాలో కనిపించాడు. అలానే తమిళ్లో స్టార్ హీరోగా గుర్తింపు సాధించుకున్న ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమాలో కనిపించాడు.

ఇకపోతే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే 100 కోట్ల సినిమా చేయాలి అంటేనే ఒక గగనంలా అనిపించేది. అంత ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ ఒక సినిమాకి వచ్చేవి కాదు. అయితే తెలుగు సినిమా స్థాయి అంచలంచలుగా పెరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో 100 కోట్ల సినిమా అనేది మామూలుగా అయిపోయింది. చాలామంది యంగ్ హీరోస్ 100 కోట్ల సినిమాలు కూడా చేసేశారు. ఇప్పుడు టార్గెట్ అంతా వెయ్యి కోట్ల సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూడు సినిమాలు 1000 కోట్లు కలెక్షన్స్ ను వసూలు చేశాయి.

Kalki

- Advertisement -

అయితే ప్రస్తుతం టాప్ లీగ్ లో ఉన్న దర్శకుల లిస్టును బయటకు తీస్తే ఎస్.ఎస్ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, నాగ అశ్విన్ పేర్లు వినిపిస్తాయి. ఇకపోతే రీసెంట్ గా కల్కి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకి 1000 కోట్లు వచ్చిన సందర్భంగా ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీని పెట్టాడు నాగి. ఎటువంటి వల్గారిటీ రక్తపాతం లేకుండా 1000 కోట్ల సినిమా చేశాము దీనికి ఆడియన్స్ కి చాలా థాంక్యూ అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే ఇది చాలామంది సందీప్ రెడ్డి వంగని టార్గెట్ చేసి పెట్టాడు అంటూ కామెంట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ స్టోరీ ను డిలీట్ చేశాడు నాగ్ అశ్విన్.

Animal Movie Poster

ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఫన్నీగా ఎందుకు డార్లింగ్ ఇద్దరూ గొడవపడతారు ఇద్దరికీ 1000 కోట్లు సినిమాలు ఉన్నాయి. నాకు 1000 కోట్లు సినిమా చేసి పెట్టండి కూల్ గా ఉండండి అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ అంటూ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు