Prabhas: ప్రతిసారి ప్రభాస్ ఎందుకు అది తీసుకోవడానికి వెనక్కు జంకుతాడు

Prabhas: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో గుర్తింపును సాధించుకున్న ప్రభాస్ నుంచి ఇప్పుడు ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ప్రభాస్ గురించి ఒక క్లారిటీ ఉంది. ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని కూడా తెలుగు ప్రేక్షకులు మిస్ అయి చాలా రోజులైంది. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ చాలాసార్లు మీడియాలో కనిపిస్తూ వస్తున్నారు. దీని కారణం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటం.

Prabhas

నాగ అశ్విని దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఈ సినిమా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రెండు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ రెండు ట్రైలర్లు కూడా సినిమా పైన అంచునాలను విపరీతంగా పెంచుతున్నాయి. హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మొదటిసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు చూస్తుంది అంటూ చాలామంది కథనాలు కూడా రాసుకుంటూ వస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ముంబైలో ఒక ఈవెంట్ ని కూడా చేశారు. ఇకపోతే ప్రస్తుతం చాలా ప్రెస్ మీట్స్ లో కనిపిస్తుంది ఈ మూవీ టీం. ఇక ఏ ప్రెస్ మీట్ చూసినా ప్రభాస్ మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడున్న ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లు ప్రభాస్ చేతికి మైక్ ఇచ్చినా కూడా తీసుకోవడానికి జంకుతున్నాడు. అయితే ఇది కేవలం ప్రభాస్ కి మొదటిసారి కాదు. బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ ఏ మీడియాలో కనిపించినా కూడా మైక్ ఇస్తే మాట్లాడటానికి కొంచెం సిగ్గు బిడియంతో ఉంటాడు. ఇది చాలామందికి క్యూట్ గా అనిపించి ఒక విశేషం అని కూడా చెప్పొచ్చు. ఇంత సిగ్గు బిడియం ఉన్న వ్యక్తి అంత బాగా యాక్ట్ చేసి ఎలా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అని కూడా  కొంతమంది ఆశ్చర్య పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు