Prabhas: ఆ సెంటిమెంట్ ను రాజా సాబ్ తో బ్రేక్ చేస్తారా..?

Prabhas.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కి , దర్శక నిర్మాతలకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకు తమ సినిమాల విషయంలో ఏదో ఒక సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంటుంది. అది మంచికైనా సరే చెడుకైనా సరే.. ఉదాహరణకు మహేష్ బాబు తన సినిమా విడుదల అయ్యే ముందు కచ్చితంగా తన తల్లి ఇందిరా దేవితో కలిసి కాఫీ తాగుతారట.. అలా తన తల్లి దగ్గర కూర్చొని కాఫీ తాగితే ఆయన సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ను ఆయన ఫాలో అయ్యేవారు. ఇంకొంతమంది దర్శకులు ఫలానా హీరోయిన్ తమ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంటుని ఫాలో అవుతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విషయంలో తమ సెంటిమెంటును ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభాస్ కి మాత్రం ‘ R ‘ అనే పదం కలిసి రావడం లేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘R’లెటర్ తో ప్రారంభమయ్యే ఆయన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా కూడా రాబోతోంది. మరి ఈ సినిమా విజయం సాధిస్తుందా అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి..?ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని ప్రభాస్ బ్రేక్ చేస్తాడా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Prabhas: Will you break that sentiment with Raja Saab?
Prabhas: Will you break that sentiment with Raja Saab?

రాఘవేంద్ర:

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ తర్వాత నటించిన చిత్రం రాఘవేంద్ర.. 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, అన్షు , శ్వేత అగర్వాల్ నటించారు. అలాగే సిమ్రాన్ ప్రత్యేక పాత్రలో నటించింది. మణిశర్మ సంగీతాన్ని అందించారు. హిందీ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ చేసారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది.

రెబల్:

ప్రభాస్, దీక్షా సేథ్ , తమన్నా ప్రధాన పాత్రల్లో 2012 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం రెబల్. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జే. భగవాన్ , జే .పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే నిలిచింది.

- Advertisement -

రాధేశ్యామ్:

రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో 2022 మార్చి 11న విడుదలైన చిత్రం రాధే శ్యామ్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పూజా హెగ్డే హీరోయిన్గా, ప్రభాస్ హీరోగా నటించారు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది

ఇలా ఈ మూడు చిత్రాలు కూడా ఆర్ లెటర్ తో స్టార్ట్ అయ్యాయి. పైగా భారీ అంచనాల మధ్య మొదలయ్యాయి..కానీ మూడూ కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. ఇప్పుడు మారుతి డైరెక్షన్లో రాబోతున్న ‘ రాజాసాబ్’ కూడా ఆర్ అనే లెటర్ తోనే ప్రారంభం కాబోతోంది. మరి ఇదే సెంటిమెంటు ఈ సినిమాకి కూడా వర్తిస్తుందా? లేక ఈ సెంటిమెంట్ ని అటు మారుతి ఇటు ప్రభాస్ బ్రేక్ చేయనున్నారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు