Actor Pragathi : ప్రగతి ఆంటీ.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా?

Actor Pragathi : సినీ నటి ప్రగతి ఆంటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. ప్రగతి ఎక్కువగా బ్రహ్మానందం భార్యగా, హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా, వదిన గా చిన్న పాత్రలు చేసి నటిగా బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది.. ప్రగతి కేవలం సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.. అవి ఎంతగా ట్రోల్స్ ను అందుకుంటాయో మనం చూస్తూనే ఉన్నాం..

actor pragathi special talent photos viral
actor pragathi special talent photos viral

ఆ ట్రోల్స్ కు ప్రగతి ఎప్పుడు స్పందించలేదు.. తన పనేంటో తాను చేసుకుంటూ పోతుంది.. ఈమె మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే.. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా మరో వైపు ఫిట్నెస్ పై కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది.. రోజూ జిమ్ కు వెళ్లి భారీగా వర్కౌట్స్ ను చేస్తుంది.. ఆ వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. జిమ్ లో వర్క్ అవుట్ లు, హెవీ ఎక్ససైజులు చేస్తూ కుర్ర హీరోయిన్లకు పోటిగా వస్తుంది.. అంతేకాదండోయ్ ఈ వయస్సులో కూడా తగ్గేదేలే అంటూ ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొన్న ఈమె మెడల్ ను కూడా గెలుచుకుంది..

actor pragathi special talent photos viral
actor pragathi special talent photos viral

ఇదిలా ఉండగా.. తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకుంది.. ఈమెలోని మరో టాలెంట్ ను బయట పెట్టింది.. మట్టితో పాత్రలను చేస్తూ కనిపించింది. పాత కాలంలో తయారు చేసినట్టుగా మట్టితో ఇలా పాత్రలను తయారు చేస్తోంది. ఇక తాను తయారు చేసిన వాటిని చూపిస్తూ తెగ మురిసిపోయింది. అందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.. పాత కాలంలో ఇలాంటి మట్టి పాత్రలు చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఊర్లో ఇలా మట్టి పాత్రలను తయారు చేస్తూనే ఉంటారు. ఇక ప్రగతి ఇలా ఇంట్లోనే తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు