Prakash Raj : ‘ఇష్టం లేకపోయినా చేశాను’

సౌత్ తోపాటు నార్త్ ను కూడా తన నటనతో ఒక ఊపు ఊపేసిన నటుడు ప్రకాష్ రాజ్. ఎటువంటి పాత్ర ఇచ్చినా అవలీలగా రక్తికట్టించే నటుడు ప్రకాష్ రాజ్. పాజిటివ్ పాత్ర అయినా, నెగిటివ్ పాత్ర అయినా స్క్రీన్ మీద రెచ్చిపోతాడు. ప్రకాష్ రాజ్ కు విలక్షణ నటుడు అనే పేరు ఊరికే రాలేదు. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన, వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఏ విషయం గురించి అయినా సరే ముక్కుసూటిగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్.

అందుకే అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఈ నటుడు నిలుస్తూనే ఉంటాడు. తాజాగా ప్రకాశ్ రాజ్ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని బయటపెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మీరు చేసిన పాత్రలో కష్టంగా అనిపించిన పాత్ర ఏది అని అడిగితే ప్రకాష్ రాజ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

సరిలేరు నీకెవ్వరు లాంటి కమర్షియల్ సినిమాల్లో అబద్ధాలు చెప్పే రాజకీయ నేత పాత్రలో, సన్నివేశాల్లో నటించడం తనకు చాలా కష్టంగా అనిపించింది అని వ్యాఖ్యానించారు. ఇక అదే మహేష్ బాబు నిర్మాతగా మేజర్ సినిమాలో చేసిన పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. తన కెరీర్లో బొమ్మరిల్లు, ఆకాశమంత సినిమాలలో చేసిన పాత్రలు కూడా ఎంతో సంతృప్తినిచ్చాయి అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి తాను ముక్కుసూటి మనిషి అని చెప్పకనే చెప్పాడు ప్రకాష్ రాజ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు