Praneetha Subhash: త్వరలో బుజ్జి బాబుకు ఆహ్వానం.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్..!

Praneetha Subhash.. ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ మరొకసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది.. తాజాగా ఈమె తన అభిమానులకు శుభవార్త తెలుపుతూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ శుభవార్తను పంచుకుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ప్రణీత సుభాష్ మరొకసారి తల్లి కాబోతోంది. ఇందుకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బావ , అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద , బ్రహ్మోత్సవం , రభస వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2021లో ప్రముఖ బిజినెస్ మాన్ నితిన్ రాజుని వివాహం చేసుకొని , ఇండస్ట్రీకి దూరమైన ప్రణీత సుభాష్ 2022లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెండేళ్లు గడవకముందే మరోసారి గర్భవతి అయ్యింది తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.

Praneetha Subhash: Invitation to Buji Babu soon.. Baby bump photos viral..!
Praneetha Subhash: Invitation to Buji Babu soon.. Baby bump photos viral..!

బేబీ బంప్ తో ఫొటోస్ వైరల్..

ఇంస్టాగ్రామ్ వేదికగా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ టీ షర్టు ధరించి, డేనిమ్ జీన్స్ లో బేబీ బంప్ కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కింద క్యాప్షన్ లో రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రణీత. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ప్రణీతకు కంగ్రాట్స్ చెబుతుంటే.. మరికొంతమంది ఇంత త్వరగా మరో బిడ్డ ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో బుజ్జి బాబు కి ఆహ్వానం పలుకుతున్నందుకు శుభాభినందనలు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ప్రణీత కెరియర్..

ఇకపోతే తెలుగు తో పాటు కన్నడ, తమిళ్ ,మలయాళం భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇటీవలే కం బ్యాక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తోంది.అయితే ఇంతలోపు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడంపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్లు చేస్తున్నారు.. పాపకు ఇంకా రెండేళ్లే కదా ఇంకా కొంచెం సమయం తీసుకుని ఉంటే బాగుండేది అని కొంతమంది అంటుంటే… లేదు దేవుడిచ్చినప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రణీత సుభాష్ త్వరలోనే రెండో బిడ్డకు కూడా తల్లి కాబోతోంది అని చెప్పవచ్చు.ప్రణీత విషయానికి వస్తే పెద్ద పెద్ద కళ్ళతో తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ, సొట్టబుగ్గల సుందరిగా మరింత పేరు దక్కించుకుంది. ఇకపోతే ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి కాబోతున్నప్పటికీ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు