Pranitha : “అంతా ఓ కలగా అనిపిస్తోంది”

టాలీవుడ్ లో వరుసగా హీరోయిన్లు అమ్మ స్థానానికి వస్తున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ ప్రణీత ఆడ పిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరోయిన్ ప్రణీత స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కూతురు తో తీసుకున్న ఫొటోను పోస్టు చేసి, ‘పాప పుట్టినప్పటి నుండి నాకు అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటం నా అదృష్టం అని చెప్పాలి. కానీ ఆమె మానసికంగా చాలా కష్టం అనుభవించిన సమయం ఇది. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అంటూ వైద్యులతో దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది ప్రణీత.

కాగ ప్రణీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సిద్ధార్థ్ తో బావ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, తారక్ తో రభస లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రణీత, ఎక్కువ కాలం ఆ క్రేజ్ ను నిలుపుకోలేక ఫెడౌట్ అయిపోయింది. ఇక ప్రణీత కి ఆడపిల్ల కి జన్మనిచ్చిన సందర్భంగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు