Pranitha : పెట్ తో కలిసి బాపు బొమ్మ చేస్తున్న పని చూడండి..!

Pranitha : టాలీవుడ్ లో బాపు బొమ్మగా పాపులర్ అయిన ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ నేలకు చెందిన ఈ భామ తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో బాపు బొమ్మ సాంగ్ తో క్రేజ్ తెచ్చుకున్న ప్రణీత ఆ పేరుతోనే తెలుగులో ఎక్కువగా ఫేమస్ అయింది. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా మాత్రం సరైన సక్సెస్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో నటించినా అవేమి మెయిన్ హీరోయిన్ రోల్స్ కావు. పైగా ప్లాప్ అయ్యాయి. అయినా అడపా దడపా సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో సినిమాలకి పెళ్లయ్యాక దూరమైంది.

Pranitha Subhash doing yoga with her pet dog

పెట్ తో యోగ చేస్తున్న ప్రణీత..

అయితే ప్రణీత పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైనా తెలుగులో ఢీ షో కి జడ్జ్ గా వచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ హిందీలో రెండు సినిమాలు చేసిన ప్రణీత ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకి గుడ్ పై చెప్పేసింది. ఇక ఇప్పుడు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్న ప్రణీత రోజూ వ్యాయామం చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఉదయం తన పెట్ డాగ్ తో కలిసి వ్యాయామం చేస్తున్న పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ప్రణీత. ఆ పిక్ లో తన పెట్ డాగ్ కూడా తనతో కలిసి కాలు లేపుతున్నట్టు ఉంది. ఇక తన బేబీ బంప్ కూడా పిక్ లో కనిపిస్తుంది.

- Advertisement -

సినిమాలకి గుడ్ బై చెప్పేస్తుందా?

ఇక ప్రణీత పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. హిందీలో రీసెంట్ గా రెండు సినిమాలు చేసిన ప్రణీత, కన్నడలో రమణ అవతార అనే సినిమాలో నటించింది. అయితే బేబీ పుట్టాక ప్రణీత సినిమాలు ఆపేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. బహుశా లైఫ్ టైం రోల్ లాంటి ఆఫర్స్ వస్తే ఏమైనా చేయవచ్చు. అయితే టెలివిజన్ షో లకి జడ్జ్ గా మాత్రం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ ఒక పాపకు జన్మనిచ్చిన ప్రణీత మరో బేబీ పుట్టాక సినిమాలు అంటే మరింత కష్టమయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ముందుముందు సినిమాలు చేస్తుందో లేదో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు