Prasanth Pandiraj: వెబ్ సిరీస్ దర్శకుడికి సినిమా అవకాశం ఇస్తున్న సూర్య

Prasanth Pandiraj: హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో సూర్య కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య చేసిన ఎన్నో సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభించింది. సూర్య నటించిన గజినీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. ఈ సినిమాకి హరీష్ జయరాజ్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ చాలామంది ఈ పాటలను పాడుకుంటారు.

Suriya

సూర్య సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. అయితే ఈ రిలీస్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు అని చెప్పొచ్చు. చాలామంది ఈ సినిమాకు హాజరై ఈ సినిమాను ఒక కన్సర్ట్ గా మార్చారు. చాలామంది తమిళ్ హీరో కంటే కూడా ముందుగా సూర్య అనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం.

- Advertisement -

డైరెక్ట్ ఓటిటి

కరోనా టైంలో సూర్య నటించిన ఎన్నో అద్భుతమైన సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ కూడా మంచి రెస్పాన్స్ ను సాధించుకున్నాయి. అందులో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా మంచి హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవ్వటమే కాకుండా ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా విషయంలో అందరికీ ఒక అసంతృప్తి ఉంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయి ఉంటే బాగుండేదని చాలామంది ఫీలయ్యారు.

వెబ్ సిరీస్ డైరెక్టర్ కు ఛాన్స్

ఇకపోతే ఇప్పుడు సూర్య ఒక వెబ్ సిరీస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ పాండురాజ్ అని ఒక వెబ్ సిరీస్ డైరెక్టర్ కు సూర్య తన తదుపరిచిన అవకాశం ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు