Prasanth Varma : ‘రేంజ్’ మారింది అయ్యా… లగ్జరీ కారు కొన్న పాన్ ఇండియా డైరెక్టర్

Prasanth Varma : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ దర్శకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త కాన్సెప్ట్ సినిమాలతో చాలా చిన్న బడ్జెట్ తో అద్భుతాలు సృష్టించిన డైరెక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం చాలామంది తెలుగు దర్శకులు తీసే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. ఇకపోతే తెలుగులో ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు.

ఆ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాను నాని నిర్మించాడు. ఈ సినిమాకి సంబంధించి కమర్షియల్ గా హిట్ కాలేదు డబ్బులు రాలేదు అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ సాధించింది అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు అలానే నానికి మంచి డబ్బులు కూడా వచ్చాయంటూ చెప్పారు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమాను తెరకెక్కించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని స్థాయిలో ఆడలేకపోయినా కూడా పర్వాలేదు అనిపించుకుంది.

Prasanth Varma

- Advertisement -

లేకపోతే ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన చివరి చిత్రం హనుమాన్. తేజ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా థియేటర్లు కూడా దొరకలేదు దీనికి తోడు పండగ సీజన్ కావడం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు లాంటి కాంబినేషన్లో సినిమా రావడం వలన ఈ సినిమాకి సరైన థియేటర్లు దొరకలేదు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఘనవిజయం సాధించడంతో మెల్లగా థియేటర్లు పెరుగుతూ వెళ్లాయి. ఆ తర్వాత ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లు కూడా వసూలు చేసింది. ఇకపోతే రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ 6 కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కారు కొనుక్కున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు