Prashant Neel: ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదేనా..?

Prashant Neel..టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా భారీ విజయాలను అందుకుంటూ ఉన్నారు. చివరిగా RRR మల్టీస్టారర్ చిత్రం లో నటించి ఇతర భాషలలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. దీంతో బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారికంగా ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని కూడా ప్రకటించడం జరిగింది.

ప్రశాంత్ మూవీ లో విలన్గా ఎన్టీఆర్..

Prashant Neel: Is that NTR's role in Prashant Neel's movie?
Prashant Neel: Is that NTR’s role in Prashant Neel’s movie?

అయితే ప్రశాంత్ నీల్ మాత్రం సలార్-2 సినిమా అయిపోయిన వెంటనే ప్రముఖ మూవీ మేకర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ తో ఎన్టీఆర్ 31 వ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి టైటిల్ కూడా డ్రాగన్ అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఎన్టీఆర్ ఒక నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. రాజకీయ డ్రాగన్ అంటే యూరోపియన్ సంస్కృతి భాషలో ఇది చెడుకి గుర్తు అనమాట. మైథాలజికల్ ప్రకారం డ్రాగన్ అంటే ఒక రాక్షసుడు అని అర్థం కూడా వస్తుందట. దీంతో ఎన్టీఆర్ మరి ఎంత వైలెంట్ గా కనిపించబోతున్నారో తెలియాల్సి ఉన్నది.

ప్రశాంత్ – ఎన్టీఆర్ కాంబో మూవీకి డ్రాగన్ టైటిల్ పరిశీలన..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్నో చిత్రాలలో హీరోలను నెగిటివ్ షేడ్స్ లో చూపించడం జరిగింది. ముఖ్యంగా కే.జీ.ఎఫ్ చిత్రంలో కూడా రాఖీ బాయ్ క్యారెక్టర్ ను విలన్ అంటూ పిలిపించి.. సరికొత్త చరిత్రను సృష్టించారు ప్రశాంత్ నీల్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథలలో ఎక్కువగా విలన్ క్యారెక్టర్లే కనిపిస్తూ ఉంటాయి. గత ఏడాది విడుదలైన సలార్ చిత్రంలో కూడా దేవా క్యారెక్టర్ ని ఇదే తరహాలోనే ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా చేయబోయే డ్రాగన్ అనే సినిమాకి కూడా కొత్త ప్రపంచాన్ని సృష్టించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అనౌన్స్మెంట్ తోనే హిట్ పక్కా..

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు నటించని తరహా పాత్రలలో నటించబోతున్నట్లు సమాచారం. మరి ఎన్టీఆర్-31 సినిమా పైన వస్తున్న ఈ విషయాల పైన అటు డైరెక్టర్ స్పందిస్తాడేమో చూడాలి మరి. ఇక ఎన్టీఆర్ విలన్ తరహా పాత్రలలో అంటే.. అభిమానులు. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. అయితే కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఈ విషయం తెలిసిన తర్వాత కచ్చితంగా హిట్ అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే ఇదివరకే జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడమే కాదు ఆ సినిమాలో విలన్ రోల్ పోషించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఈయన విలన్ గాను హీరోగాను నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అనౌన్స్మెంట్ తోనే బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టేలా కనిపిస్తోంది ఈ సినిమా. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు