Prashanth Varma : *00 కోట్లు – హాలీవుడ్ రేంజ్‌తో పాటు ఇంకెన్నో… జై హనుమాన్ మూవీ ఊహకు కూడా అందేలా లేదు..!

Prashanth Varma: ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇండియన్ రియల్ సూపర్ మాన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం హనుమాన్. చైల్డ్ యాక్టర్ గా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు . 2024 జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ , చైనీస్, కొరియన్ , స్పానిష్, జపనీస్తో సహా పలు ఇండియన్ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఊహించని రికార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన బడా స్టార్ హీరో మహేష్ బాబు కూడా తన సినిమాతో.. వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పవచ్చు. ఐ ఎం డి బి లో ఏకంగా 7.8 రేటింగ్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. కేవలం రూ .40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా రూ .100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ సినిమా తెరకెక్కించిన తీరు చాలా అద్భుతంగా ఉందని విమర్శకులు కూడా డైరెక్టర్ ను ప్రశంసించారు.

Prashanth Varma : *00 crores - Hollywood range and more... Jai Hanuman movie is beyond imagination..!
Prashanth Varma : *00 crores – Hollywood range and more… Jai Hanuman movie is beyond imagination..!

ఊహకు కూడా అందని రేంజ్ లో జై హనుమాన్ ..

ఇకపోతే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జై హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు హనుమాన్ క్లైమాక్స్ లో రివీల్ చేసిన విషయం తెలిసిందే.. ఇక అందులో భాగంగానే జై హనుమాన్ కి సంబంధించిన కొన్ని విషయాలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఊహకు కూడా అందకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.

రూ.200 కోట్ల బడ్జెట్..

అసలు విషయంలోకెళితే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను ఏకంగా రూ .200 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం హాలీవుడ్ మేకర్స్ ను సంప్రదించాలని, ఒప్పించి ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ ను ఈ సినిమా కోసం ఉపయోగించబోతున్నట్లు కూడా సమాచారం.. ఈ సినిమాకు సంబంధించి వెలువడుతున్న వార్తలు మన ఊహకు కూడా అందడం లేదు అని చెప్పవచ్చు. హనుమాన్ చిత్రాన్ని రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకేక్కించి భారీ ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ వర్మ , ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా రూ .200 కోట్లు బడ్జెట్ అంటే నిజంగా పెద్ద సాహసం చేస్తున్నారని చెప్పాలి. మరి ప్రశాంత్ వర్మ ఈ సినిమాను ఏ రేంజ్ లో టేకప్ చేస్తారు అనే విషయం అందరిలో ఉత్కంఠ గా మారింది.

- Advertisement -

సామాన్యులకు కూడా అవకాశం..

ఇకపోతే ఈ సినిమాలో సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తానని, మెగా హీరోలు , బడా హీరోలు కూడా ఇందులో పాల్గొనవచ్చు అంటూ తెలిపిన విషయం తెలిసిందే. మరి నటునటుల ఎంపిక ఏ విధంగా జరుగుతుంది.. ?ఎవరెవరిని ఏ పాత్రల కోసం ఎంపిక చేసుకుంటారు ? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి మొత్తానికైతే జై హనుమాన్ తో మరో ప్రపంచం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు