Lavanya – Raj Tarun : కేసులోకి మూడో వ్యక్తి… ప్రీతి ఓ పచ్చి తాగుబోతు.. ఆధారాలతో బయటపెట్టిన లావణ్య

Lavanya – Raj Tarun : రాజ్ తరుణ్ – లావణ్య ల ప్రేమ వ్యవహారం కేసు రోజోరోజుకు ముదురుతోంది. రోజుకో ట్విస్ట్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. ఆ మధ్య ఆర్జే శేఖర్ లావణ్య ఆడియోలు బయటపెట్టి కేసుని మరింత పెద్దది చేసాడు. ఇక రాజ్ తరుణ్ మాత్రం తన సినిమాల కోసం సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, తీగ లాగితే డొంక కదులుద్ది అన్నట్టు, కొత్త కొత్త లింకులు ఈ కేసులో వచ్చిపడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఓ ఛానల్ డిబేట్ పెట్టిన లావణ్య – ఆర్జే శేఖర్ బాషా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోబోయారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏకంగా శేఖర్ పై చెప్పు విసిరింది లావణ్య. ఆ తర్వాత స్టూడియోని వదిలి వెళ్లిపోయాయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసులోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారు.

Preethi to entered in Raj Tarun's - Lavanya case

లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందంటూ.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు…

ఇక లావణ్య – రాజ్ తరుణ్ (Lavanya – Raj Tarun) కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని, నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫ్రెండ్స్ అయిన ప్రీతీ, ఉదయ్ అనే వ్యక్తులు పిర్యాదు చేసారు. కంప్లైంట్ లో తనకు లావణ్యతో మూడేళ్ళుగా పరిచయమని, డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ తనకు లావణ్య ఫోన్లు చేసి తమని ఇబ్బందులు పెడుతుందని పోలీసులకు ఫిర్యాదులో ప్రీతీ చెప్పడం జరిగింది. అయితే లావణ్య అప్పటికప్పుడు దీనిపై రిప్లై ఇస్తూ ఏకంగా వీడియోలతో సహా ఆధారాలు బయటపెట్టింది.

- Advertisement -

 

ఆమె పచ్చి తాగుబోతు.. ఆధారలతో బయటపెట్టిన లావణ్య..

ఇక నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫ్రెండ్ ప్రీతి లావణ్యపై డ్రగ్స్ అలవాటు చేసిందని ఆరోపిస్తూ కంప్లైంట్ చేయగా, దానికి లావణ్య అప్పటికప్పుడు రిప్లై కూడా ఇస్తూ, ఏకంగా వీడియోలతో సహా ఆధారాలు బయటపెట్టింది. ప్రీతీ గురించి చెప్పుకొస్తూ, ప్రీతీ ఓ పచ్చి తాగుబోతు అని, నేను ఆమెకి ఏ అలవాటు చేయలేదని, ఆమెకే డ్రగ్స్, ఇంకా గంజాయి సేవించే అలవాటు ఉందని లావణ్య చెప్పుకొచ్చింది. అంతే కాదు తనపై ప్రీతి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని లావణ్య తన దగ్గరున్న ప్రీతీ వీడియోలను, మద్యం, గంజాయి సేవిస్తున్న వీడియోలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇక ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా, కేసు ముదురుతుండగా, రాజ్ తరుణ్ కంటే లావణ్య పై ఎక్కువ ట్విస్ట్ లు వస్తున్నాయని తెలుస్తుంది. మరి పోలీసువారు ఈ కేసుని ముగించడానికి ఇంకెన్నాళ్లు టైం తీసుకుంటారో తెలీదు. ఇక రీసెంట్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా లావణ్య పై న్యూసెన్స్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు