Preity Zinta: పిల్లల విషయంలో సరోగసి.. అసలు కథ ఏంటంటే..?

Preity Zinta.. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు వివాహం అనంతరం ఎక్కువగా తల్లిదండ్రులు అవ్వడానికి సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నయనతార (Nayanatara) ను మొదలుకొని చాలామంది హీరోయిన్లు సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు. ఇక సౌత్ హీరోయిన్ లే కాదు ఇప్పుడు నార్త్ హీరోయిన్లు కూడా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా (Preity Zinta)కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తల్లి కావడానికి పడిన కష్టాల గురించి అలాగే సరోగసి ద్వారా కవలలకు జన్మనివ్వడానికి ముందు, IVF ప్రయత్నించిన తర్వాత తనకు ఎలా అనిపించింది అనే విషయాలను అభిమానులతో పంచుకుంది.

Preity Zinta: Surrogacy for children.. What is the real story..?
Preity Zinta: Surrogacy for children.. What is the real story..?

గర్భం దాల్చడం కోసం ఐవిఎఫ్ ను ఆశ్రయించిన ప్రీతి జింటా..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి జింటా మాట్లాడుతూ.. నా జీవితంలో సంతోషకరమైన రోజులతో పాటు కన్నీళ్లు తెప్పించే రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చాను. తల్లి కావడానికి నేను పడ్డ కష్టం వర్ణనాతీతం. తల్లి అవడం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఐవీఎఫ్ ఆశ్రయించినప్పుడు, కూడా ఆ సమయంలో సంతోషంగా అనిపించినా ఆ సంతోషంగా ఉండడానికి ఎంతో కష్టపడ్డాను అంటూ తెలిపింది. 49 ఏళ్ల వయసులో అందరిలాగే నేను కూడా కష్టపడ్డాను అంటూ అంగీకరించింది ప్రీతీ జింటా.

నరకం భరించలేనిది..

తల్లి కావాలని ఎంతో ప్రయత్నించాను. అందులో భాగంగానే ఐవీఎఫ్ ఆశ్రయించినప్పుడు ట్రీట్మెంట్ లో భాగంగా ఎంతో పెయిన్ అనుభవించాను. ఆ బాధను భరించలేక గోడకు తలను బాదుకొని ఏడవాలనిపించేది. ఆ డిప్రెషన్లో ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎవరితో కూడా మాట్లాడలేకపోయాను అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రీతి జింటా సరోగసి ద్వారా నవంబర్ 2021లో కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన భాగస్వామి జీన్ గుడ్ ఎనఫ్ తో ఇద్దరూ కవల పిల్లలకు వెల్కమ్ చెప్పింది. అలాగే తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. సహజ పద్ధతిలో గర్భం దాల్చకపోవడం వల్లే ఐవీఎఫ్ ఎంచుకున్నాను అంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

సహజగర్బం దాల్చలేక ఐవిఎఫ్ ఆశ్రయించిన ప్రీతి..

అంతేకాదు తన పిల్లల కోసం సహకరించినందుకు తనను అమ్మ అనే పదానికి దగ్గర చేసినందుకు సరోగేట్ కి కూడా కృతజ్ఞతలు తెలిపింది. ఇక 2022లో మాతృ దినోత్సవం సందర్భంగా మొదటిసారి తన కవల పిల్లల ఫస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలామంది అందం చెడిపోతుంది అని సినిమాలలో అవకాశాలు రావు అంటూ సరోగసి దారిన పడుతుంటే, ఇలాంటి చాలామంది తల్లి అనే పదానికి దగ్గర అవడం కోసం ఎన్నో కష్టాలను పడి సహజంగా గర్భం దాల్చలేక ఇలా ఐవిఎఫ్ ఆశ్రయిస్తూ అమ్మ అనే పదానికి దగ్గరవుతున్నారు. ఏది ఏమైనా అమ్మ అని పిలిపించుకోవడానికి ప్రీతి జింటా పడిన కష్టాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది తల్లి అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఒకప్పుడు రాజకుమారుడు, మెరుపు కలలు లాంటి అద్భుతమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో బిజీగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు