Prema Katha Chitram: ప్రేమ కథా మళ్లీ చెబుతానంటున్న సుధీర్‌ !

సుధీర్ బాబు ఈ హీరో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ సుధీర్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రేమ కథ చిత్రం సినిమా అనంతరం సుధీర్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా సుధీర్ తన ఖాతాలో ఓ మంచి హిట్ పడాలని ఎంతో ఆరాటపడుతున్నారట.

సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి సినిమాలతో ఒకప్పుడు ప్రేక్షకులను అలరించి మెప్పించిన సుధీర్ బాబు ఆ తర్వాత కాస్త గాడి తప్పాడు. శ్రీదేవి సోడా సెంటర్, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, మామా మశ్చింద్రా వంటి సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సుధీర్ పట్ల ప్రేక్షకుల్లో క్రమంగా ఆసక్తి కాస్త తగ్గిపోయింది. సుధీర్ కెరియర్లో మంచి సక్సెస్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం ప్రేమ కథ చిత్రం మాత్రమే.

 

- Advertisement -

ఈ సినిమాలో నందిత సుదీర్ బాబుకి జోడిగా నటించగా…. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మారుతి నిర్మాతగా వ్యవహరించాడు. హర్రర్, కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో తెలుగులో వరుసగా రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. అందులో భాగంగానే కొన్ని సినిమాలకు సూపర్ సాలీడ్ కలెక్షన్లు కూడా వస్తున్నాయి. దానిలో ప్రేమ కథ చిత్రం సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను రేపు అంటే జూన్ 21వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన సుధీర్ అభిమానులు ఈ సినిమా చూడాలని ఆసక్తితో ఉన్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు