Prema : డైరెక్ట‌ర్ అంత పని చేశాడా ?

సీనియర్ స్టార్ హీరోయిన్ “ప్రేమ” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! మొదట ఆమె కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత వెంకటేష్ – సురేష్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ధర్మచక్రం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. ఆ తరువాత కోరుకున్న ప్రియుడు, ఓంకారం, దేవి, రాయలసీమ రామన్న చౌదరి, చిరునవ్వుతో వంటి చిత్రాలలో నటించింది.

కొన్నాళ్ల తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుతూ వస్తున్న స‌మ‌యంలో సినిమాలు తగ్గించి జీవన్ అప్పచ్చు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ వీరి మధ్య మనస్పార్థాలు చోటు చేసుకోవడంతో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా ఆమె ” అనుకోని ప్రయాణం” అనే మూవీతో రీఎంట్రి ఇచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 28న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా ప్రేమ మాట్లాడుతూ.. తాను మొదట కన్నడ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని బాగా తిట్టారంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కన్నడ హీరో శివరాజ్ కుమార్ తో నటించాలనేది తన చిన్ననాటి కల అని, ఆయనతోనే తన తొలి సినిమా చేస్తుంటే అసలు డైలాగ్ చెప్పడానికి రాలేదని, పదేపదే షాట్స్ తీస్తున్న డైలాగ్ డెలివరీ రాకపోవడంతో చివరికి డైరెక్టర్ తనపై అరిచారని చెప్పుకొచ్చింది. బ్రేక్ సమయంలో మా అమ్మ కూడా నన్ను చాలా తిట్టిందని.. డైరెక్టర్ తో ఎన్నిసార్లు చెప్పించుకుంటావు.. ఆయన చెబుతుంటే నాకే అసహ్యంగా అనిపిస్తుందని వాళ్ళ అమ్మ కూడా తన‌ని తిట్టిందని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు