Mamitha Baiju: ప్రేమలు బ్యూటీని చుట్టుముట్టిన అభిమానులు.. హడలిపోయిన బ్యూటీ..!

Mamitha Baiju: ప్రేమలు చిత్రంతో మలయాళ హీరోయిన్ మమిత బైజు మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మూవీలో తన నటన, అందంతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. ఇక‌ ఈ చిత్రంతో నేషనల్ రేంజ్ లో ఈమెకి క్రేజ్ ఏర్పడింది.

చాలామంది ఫ్యాన్స్ అయ్యారు కూడా. కాగా ఈ బ్యూటీ తాజాగా ఓ కమర్షియల్ ఈవెంట్ కు వెళ్లగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీ స్థాయిలో ఎగబడ్డారు. చెన్నైలోని విఆర్ మాల్ లోని ఓ జూలరీ షో ఈవెంట్ కు ఈ బ్యూటీ హాజర్ అయ్యారు. అయితే ఆ సమయంలో ఆమెను చూసేందుకు వందలాదిమంది అక్కడికి వచ్చారు. మమిత రాగానే ఒకేసారి ముందుకు వచ్చేందుకు తోసుకున్నారు.

Mamitha Baiju: Telugu entry with star hero together.. with success rate..?
Mamitha Baiju: Telugu entry with star hero together.. with success rate..?

ఆమెను చుట్టుముట్టారు. హఠాత్తుగా ఇలా జరగడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ కూడా హడలిపోయింది. కాస్త భయపడినట్లు ఫొటోస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. పాపం రా ఆ పిల్లని అలా భయపెట్టేస్తారేంటి? ఎంత భయపడిపోతుందో చూడండి?.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు