Premalu: కారు ప్రమాదం..రక్తం మడుగుల్లో ప్రేమలో నటుడు..!

Premalu.. తాజాగా ప్రేమలు నటుడు సంగీత్ ప్రతాప్ మలయాళం నటుడు అర్జున్ అశోక కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. కొచ్చిలో శనివారం తెల్లవారుజామున బ్రోమాన్స్ సినిమా షూటింగ్లో ఉండగా కారు ప్రమాదానికి గురైంది. 2 బైక్లను ఢీకొన్న కారు అదుపుతప్పి బోల్తా పడి తీవ్రంగా ధ్వంసం అయిపోయింది. అదృష్టవశాత్తు ఇద్దరి నటులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అసలు ఆక్సిడెంట్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Premalu: Car accident..Actor in love in pools of blood..!
Premalu: Car accident..Actor in love in pools of blood..!

అర్ధరాత్రి కార్ ఆక్సిడెంట్..

ప్రేమలు సినిమాలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న సంగీత్ ప్రతాప్, అర్జున్ అశోక్ నటించగా, అరుణ్ జోష్ దర్శకత్వం వహించిన చిత్రం బ్రోమాన్స్.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొచ్చిలో శరవేగంగా జరుగుతోంది. సినిమా షూటింగ్లో భాగంగా హై స్పీడ్ ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉండగా ఎంజీ రోడ్డులో అర్ధరాత్రి కారు ప్రమాదానికి గురైంది. 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో వాహనం బోల్తా పడింది. నటులు, బైక్ రైడర్ తో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. రక్తం మడుగుల్లో ఉన్న నటీనటులను వెంటనే ఆసుపత్రికి తరలించారు చిత్రబృందం. నటీనటులు ప్రయాణిస్తున్న కారు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో వాహనం అదుపుతప్పి, మరో బైక్ ను ఢీకొట్టడంతో పక్కకు పల్టీలు కొట్టిందట. కారు బాగా ధ్వంసం అయిందని సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఇద్దరికీ కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ప్రమాదం ఈరోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమా స్టంట్ మాస్టర్ కారు నడిపాడు.అదుపు తప్పి రెండు బైకులను ఢీ కొట్టింది. పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని వాహనాలను రోడ్డు నుంచి తొలగించారు. ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

స్వల్ప గాయాలతో బయటపడ్డ నటులు..!

ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆషిక్ ఉస్మాన్ నిర్మించిన బ్రోమాన్స్, 18 ప్లస్, జో అండ్ జో చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అరుణ్ జోస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇటీవలే కాక్కనాడ్ లో జరిగింది .ఇందులో మహిమా నంబియార్, కళాభవన్ షాజోన్, బిను పప్పు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్ వసంత ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు రవీష్ నాథ్ మరియు థామస్ పి. సభాష్టియన్ సినిమా కథను రాశారు. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేయాలని పనిలో పడ్డ వీరు ఇలా ఆక్సిడెంట్ గురవడంతో సినిమా షూటింగ్ కాస్త ఆపివేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చాలా మారుతున్నాయి. ఏది ఏమైనా నటీనటులిద్దరూ సేఫ్గా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ప్రస్తుతం నటినటులు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. త్వరగా కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరి ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న వీరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు