Premi Vishwanath : సీరియ‌ల్ టూ సినిమా

‘మానాడు’ వంటి సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య కాంబోలో ఓ మూవీ వ‌స్తోంది. ఈ చిత్రానికి ‘NC22’ వ‌ర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో విశేషం ఏంటంటే మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజాతో పాటు ఆయ‌న కుమారుడు యువ‌న్ శంక‌ర్ రాజా కూడా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కే ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నార‌ట‌.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు న‌టిస్తున్నారు. సినిమా క్యాస్టింగ్‌ను ఒక్కొక్క‌రిగా రివీల్ చేస్తుంది చిత్ర యూనిట్. న‌టి ప్రియ‌మ‌ణి, వెన్నెల కిషోర్‌, సంప‌త్ రాజ్‌, ప్రేమ్ గి అమ‌రేన్‌, అదేవిధంగా వంట‌ల‌క్క‌ను కూడా తీసుకున్నార‌ట‌. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమి విశ్వ‌నాథ్. చాలా మందికి ప్రేమి విశ్వ‌నాథ్ అంటే తెలియ‌దు. వంట‌ల‌క్క అంటే అంద‌రికీ తెలియ‌డం విశేషం. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో వంట‌ల‌క్క పేరు తెలియ‌ని వారుండ‌రు.  మాటీవీలో ప్ర‌సార‌మ‌య్యే  ‘కార్తీక దీపం’ సీరియ‌ల్‌తో ఈమెకి మంచి క్రేజ్ వ‌చ్చింది.

కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క బాగా క్లిక్ అవ్వ‌డంతో తాజాగా సినిమాల్లో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. తాజాగా నాగ‌చైత‌న్య సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకున్న ప్రేమి విశ్వ‌నాథ్ రోల్ క్లిక్ అయితే టాలీవుడ్‌లో మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం ఖాయం. ఈ చిత్రంలో విల‌న్ గా అర‌వింద్ స్వామి న‌టించ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు