Priya Bhavani Shankar : అందుకు సారీ , కానీ ఎవరు అటువంటి అవకాశాన్ని వదులుకోరు

Priya Bhavani Shankar : ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించుకోలేవు. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా భారతీయుడు 2. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో ఎమోషన్,కాన్సెప్ట్, మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. అదే సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు టు సినిమాని తెరకెక్కించాడు.

ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఈ సినిమాను దాదాపు 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. రీసెంట్గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సాధించింది. కొంతమంది తమిళ్ యంగ్ దర్శకులు మాత్రం ఈ సినిమా గురించి పొగుడుతూ ట్విట్టర్ వేదిక పోస్టులు పెట్టారు. లేకపోతే ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ ఒక కీలక పాత్రలో కనిపించింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేసింది ప్రియా భవాని శంకర్.

Priya bhavani shankar

- Advertisement -

ఇండియన్ టు సినిమాలో నటించడం నా అదృష్టం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది పర్సనల్ గా నన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా బాధనిపించింది. ఎవరు సినిమా డిజాస్టర్ అవుతుంది అని ఊహించి చేయరు. దీంట్లో ప్రొడ్యూసర్ మనీ దర్శకుడు యొక్క ఆలోచన ఇలా చాలా ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. సినిమా అనేది ఒక సమిష్టి కృషి. కమల్ హాసన్ సార్ సినిమాలో శంకర్ సార్ దర్శకత్వంలో ఏమైనా అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ఈ సినిమా రిజల్ట్ ముందు తెలిసిన కూడా నేను ఇలానే చేసేదాన్ని అంటూ చెప్పకు వచ్చింది. సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది అందుకు సారీ కానీ ఎవరు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు అని చెప్పింది భవాని శంకర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు