Priya Darshi: నువ్వు రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను అర్జునుడు అన్న

Priya Darshi: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు అనే సినిమాలో కౌశిక్ అనే పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ప్రియదర్శి. ఆ సినిమా కంటే ముందే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు కూడా. అయితే పెళ్లిచూపులు సినిమా ప్రియదర్శికి మంచి బ్రేక్ ఇచ్చింది. అక్కడితో ప్రియదర్శికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి కాన్సెప్ట్ ని పట్టుకొని కేవలం ఒక నటుడును తీసుకొని తనను హీరోని చేసే ప్రయత్నాలు ఎప్పుడు నుంచో జరుగుతూ వస్తున్నాయి.

ఇకపోతే అలానే చాలా టీవీ షోస్ ద్వారా గుర్తింపు సాధించుకున్న చాలామంది నటులను కమెడియన్లను హీరోలను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చాలామంది కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలానే ప్రియదర్శిని కూడా హీరోని చూస్తూ చాలామంది సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ప్రియదర్శి హీరోగా మల్లేశం అనే ఒక సినిమాను కూడా చేశారు. ఆ తర్వాత వేణు దర్శకుడిగా ప్రియదర్శి హీరోగా బలగం అనే ఒక సినిమాను కూడా చేశారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఎంత హిట్ సాధించాయి అనే విషయం పక్కనపెడితే ప్రియదర్శికి మంచి ప్రశంసలు తీసుకొచ్చి పెట్టాయి.

Nani

- Advertisement -

ఇక ప్రస్తుతం ప్రియదర్శి నబా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా డార్లింగ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వచించారు. ఈ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. నాని నువ్వు ఉద్దేశిస్తూ ప్రియదర్శి మాట్లాడుతూ ఈ జనరేషన్ లో నువ్వే మాకు మెగాస్టార్ అన్న చాలామంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా మీరు కష్టపడి పైకి వచ్చారు. ఇంకా చెప్పాలి అనండి మీరు రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను అర్జునుడు అన్న అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే నాని బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమాలో దర్శి తన తదుపరి సినిమాను చేయనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు