Khalasay song : పక్కా హైదెరాబాదీ స్టైల్లో అదరగొడుతున్న ‘ఖలాసే’.. రామ్ మిరియాల మాస్…

Khalasay song : టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తన ట్రెండి కామెడీతో అలరిస్తూ, ఇప్పుడు హీరోగా కూడా మారి మంచి విజయాలు సాధిస్తున్న ప్రియదర్శి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మంచి కామెడీ పాత్రలు స్టార్ హీరోల సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ బలగం సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రియదర్శి, మంగళవారం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ప్రియదర్శి హీరోగా ‘డార్లింగ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. పాన్ ఇండియా సెన్సేషన్ హనుమాన్ మూవీ తర్వాత కె నిరంజన్ రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ లో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంతకు ముందు రిలీజ్ అయి ఆకట్టుకోగా, శ్రీమతి చైతన్య ఈ రోమ్-కామ్ ను ప్రజెంట్ చేస్తున్నారు. అశ్విన్ రామ్ డార్లింగ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ‘ఖలాసే’ పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది.

Priyadarshi's darling movie Khalase song release

హైదెరాబాదీ స్టైల్లో మాస్ సాంగ్..

ఇక ప్రియదర్శి నటిస్తున్న డార్లింగ్ సినిమా కి సంబంధించి మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్‌లను కిక్ స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో ‘ఖలాసే’ (Khalasay song) సాంగ్ కాసేపటికిందే యూట్యూబ్ లో రిలీజ్ కాగా, ఆ పాట నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ ఖలాసే” పేరుతో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ పెప్పీ నంబర్‌ను కంపోజ్ చేశారు. ఈ పాటను హనుమాన్ సిహెచ్‌ తో కలిసి రామ్ మిరియాల సూపర్ గా పాడారు. రామ్ మిరియాల వాయిస్ లో ఫన్ వైబ్ మరింత ఎనర్జీని క్రియేట్ చేసింది. ఇక ఈ పాట ఓ కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్ ని ప్రజెంట్ చేస్తోంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు లైఫ్ లో చిల్‌ అవ్వమని చెబుతుంటారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం హ్యూమరస్ గా వుంది. ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ గా ప్రమోట్ చేస్తున్న ఈ పాటలో ప్రియదర్శి తన డ్యాన్స్ స్కిల్స్ చూపించాడు. ఇక ఈ పాట పక్కా హైదెరాబాదీ స్లాంగ్ లో హైదరాబాద్ స్టైల్లోనే ఉండడం వల్ల యూత్ ఆడియన్స్ కి ఈ పాట విపరీతంగా కనెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు.

- Advertisement -

అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్…

ఇక డార్లింగ్ టైటిల్‌ గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్ సింగిల్ కూడా ఇన్స్టంట్ హిట్‌ గా నిలిచింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే మేకర్స్ డిఫరెంట్ గా హీరోహీరోయిన్ల గొడవలా క్రియేట్ చేసి ఎంత బజ్ పెంచారో తెలిసిందే. ఇప్పుడు టీజర్, సాంగ్ తో కూడా అంచనాలు, మరింత పెంచేశారు. ఇక బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నరేష్ రామదురై డీవోపీ వ్యవహరిస్తుండగా, హేమంత్ డైలాగ్స్ అందిస్తున్నారు, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ ఇ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా డార్లింగ్ సినిమాను ఆగష్టు లో లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు