SaripodhaaSanivaaram : సూర్య కోసం ‘చారులత’ వచ్చేసింది..!

SaripodhaaSanivaaram : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో ‘సరిపోదా శనివారం’ మూవీ కూడా ఒకటి. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దానికి కారణం ఇంతకు ముందు వీరి కాంబోలో అంటే సుందరానికి వంటి క్లాసిక్ మూవీ రావడమే. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఇప్పుడు చాలామందికి ఫేవరేట్ మూవీ. డిజిటల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ సినిమా. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్లో సరిపోదా శనివారం సినిమా వస్తుండడంతో టాలీవుడ్ లో క్రేజీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిపోగా, ఇప్పటినుండే ప్రమోషన్లు స్టార్ట్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి సాలిడ్ రెస్పాన్స్ రాగా, కాన్సెప్ట్ తోనే మేకర్స్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసారు. ఇక రీసెంట్ గా విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ ‘గరం గరం’ కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ వదిలారు.

Priyanka Arul Mohan As Charulatha In SaripodhaaSanivaaram

సూర్య కోసం చారులత..

సరిపోదా శనివారం (SaripodhaaSanivaaram) సినిమా నుండి రీసెంట్ గా నాని సెకండ్ లుక్ ని కూడా వదలగా, లేటెస్ట్ గా నేడు ఈ సినిమా హీరోయిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ప్రియాంక అరుల్ మోహన్ పాత్రకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఇక రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో, ప్రియాంక చారులత అనే పాత్రలో నటిస్తుందని రివీల్ చేయగా, అందులో పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తుందని తెలుస్తూనే ఉంది. ఇక నాని ఇందులో సూర్య అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొన్నామధ్య ఎస్.జె. సూర్య పాత్ర లుక్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్.

- Advertisement -

ఆగష్టు లో రిలీజ్ కి రెడీ..

ఇక సరిపోదా శనివారం సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎస్‌జె సూర్య నటిస్తుండగా, సాయి కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక సరిపోదా శనివారం ఆగష్టు 29, 2024న గ్రాండ్ రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కుదిరితే ఆగస్టు 15నే రిలీజ్ చేద్దామని అందుకుంటున్నా పోటీ వల్ల ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా రిలీజ్ కి నెలన్నర సమయం ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు. ఓవరాల్ గా సోలో రిలీజ్ కోసం మేకర్స్ ట్రై చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు