Priyanka Arul Mohan : ఐరన్ లెగ్ ముద్ర పోయినట్టేనా? పవన్ చేతిలోనే నాని హీరోయిన్ ఫ్యూచర్

Priyanka Arul Mohan : సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. కూసింత లక్ కూడా ఉండాలి అంటారు సినీ పెద్దలు. అది చాలామంది హీరోయిన్ల విషయంలో నిజం కూడా అయ్యింది. కృతి శెట్టి, శ్రీలీల లాంటి యంగ్ హీరోయిన్లు ఉప్పెనలా ఎగిసిపడి, సడన్ గా కన్పించకుండా పోయారు. ఈ లిస్ట్ లో తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఉంటుంది. తాజాగా సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ గతంలో పడిన ఐరన్ లెగ్ ముద్రను ఈ మూవీతోనైనా చెరిపేసుకుందా ? అనే విషయంలోకి వెళ్తే..

టాలీవుడ్ లో కలిసిరాని లక్

ప్రియాంక మోహన్ కు టాలీవుడ్ లో అనేక అవకాశాలు వచ్చినప్పటికీ, ఆమె తన పాత్రలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటోంది. ఫలితంగా కేవలం మూడు తెలుగు చిత్రాలకే పరిమితమైన ఫిల్మోగ్రఫీ ఆమె ఖాతాలో పడింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆమె ప్రయాణం ఆశించిన విధంగా సాగలేదనే చెప్పాలి. నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరపైకి అడుగు పెట్టింది ప్రియాంక. మొదటి సినిమాతోనే తన అందం, అమాయకత్వంతో యూత్ మనసును దోచుకుంది. అయితే ప్రేక్షకులు ఆమెను పెద్దగా ఆదరించలేదు. గ్యాంగ్ లీడర్ ఆమెకు ఆశించిన రిజల్ట్ ను ఇవ్వలేదు. దీంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత శర్వానంద్ సరసన శ్రీకారం అనే సినిమాలో నటించి మరోసారి తన లక్ ను పరీక్షించుకుంది. కానీ ఈసారి కూడా ఫలితం బెడిసికొట్టడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది ప్రియాంక ఖాతాలో.Actress Priyanka Mohan : "உடனே ஜட்ஜ் பன்றாங்க".. கவர்ச்சியாக ஏன்  நடிப்பதில்லை - ஓப்பனாக பேசிய பிரபல நடிகை பிரியங்கா மோகன்!

ఐరన్ లెగ్ ముద్ర పోయినట్టేనా..

టాలీవుడ్ లో లక్ కలిసి రాకపోవడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేసింది. అయితే అక్కడ ఆమె జర్నీ ఒకే ఒకే అన్నట్టుగానే సాగింది. కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు.. ఈ క్రమంలోనే వచ్చిన ఆమె తమిళ డబ్బింగ్ సినిమాలు ‘కాలేజ్ డాన్’, ‘డాక్టర్’ కూడా ఆ లోటును పూర్తిగా భర్తీ చేయలేకపోయాయి. అయితే మరోసారి తాజాగా స్ట్రెయిట్ తెలుగు సినిమా సరిపోదా శనివారంతో ప్రియాంక కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశం కన్పిస్తోంది. సరిపోదా శనివారం పాజిటివ్ రివ్యూలను అందుకుని దూసుకెళ్తోంది. కమర్షియల్ గా ఈ సినిమా హిట్ అయ్యేలా కన్పిస్తోంది. ఇందులో ప్రియాంక నటన, కానిస్టేబుల్ గా ఆమె పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నటనకు ప్రాధాన్యతనివ్వడం వల్లే ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటిదాకా కేవలం ఎక్స్‌పోజింగ్‌ సీన్స్‌లో నిమగ్నమై ఉండటం ఆమెకు తెలుగు చిత్రసీమలో అవకాశాలకు అడ్డంకి తెచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాతో ఆమెపై పడిన ఐరన్ లెగ్ ముద్రతో పాటు అవకాశాల వెల్లువ కూడా మొదలవుతుందని అంచనా వస్తున్నారు సినిమా పండితులు.

- Advertisement -

పవన్ చేతుల్లోనే ప్రియాంక కెరీర్

“సరిపోదా శనివారం” బాక్సాఫీస్ పనితీరు నిస్సందేహంగా ఆమె భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేస్తుంది. పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ “OG” మూవీలో కూడా ప్రియాంక హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మూవీ గనుక బ్లాక్ బస్టర్ అయితే ప్రియాంకకు ప్రముఖ తెలుగు హీరోల నుండి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ప్రియాంక కెరీర్ పవన్ చేతుల్లో ఉందన్నమాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు