Priyanka Chopra: చాలా మందితో డేటింగ్ చేశా

దేశవ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లో ఎంతోమంది భామలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకొని స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఫలితంగా సుదీర్ఘకాలం పాటు హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా ఒకరు. టీనేజ్ లో ప్రపంచాన్ని తన అందంతో గెలుచుకున్న ఈ బ్యూటీ చాలా ఏళ్లపాటు ఇండియా వైడ్ గా ప్రభావాన్ని చూపించింది.

ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా తెగ సందడి చేసింది. ఇక వివాహం తర్వాత స్పీడ్ తగ్గించిన ప్రియాంక చోప్రా… సోషల్ మీడియాలో మాత్రం అందాల వల వేస్తోంది. అయితే తాజాగా ప్రియాంక చోప్రా గతంలో బాలీవుడ్ కి చెందిన పలువురు హీరోలతో డేటింగ్ చేసినట్లు అంగీకరించింది. అయితే వివాహానికి ముందు సంబంధాలను ‘సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డోర్ మ్యాట్’ గా పేర్కొన్న నటి అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ లతో వచ్చిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకుంది.

ఈ మేరకు పనిలో భాగంగా దాదాపు ప్రతి సహ నటుడితో డేటింగ్ చేయడం సాధారణ విషయమేనన్న ఆమె…’నేను ఒక బంధం నుంచి మరో సంబంధానికి వెళతాను. దేనికి ఎక్కువ సమయం తీసుకోను. పని చేసిన నటీనటులతో లేదా సెట్ లో కలిసిన వ్యక్తులతో డేటింగ్ చేస్తుంటాను. ఎందుకంటే ఇద్దరి మధ్య రిలేషన్ ఆ ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దడానికి మేలు చేస్తుందని భావిస్తాను. అయితే నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు అందరూ నా ఆలోచనకు సరిపోయేలా ఉండాలని కోరుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు