Priyanka Chopra: ఆరోజు తీసుకున్న నిర్ణయమే..నేడు ఇలా మార్చిందా..?

Priyanka Chopra.. ఒకప్పుడు ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నేడు హాలీవుడ్ బ్యూటీగా మారి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. దేశంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన ఈమె ప్రస్తుతం హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ సొంతం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకుంది. అంతేకాదు భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకున్న ఏకైక హీరోయిన్గా రికార్డు సృష్టించింది ప్రియాంక చోప్రా. ఇకపోతే ప్రియాంక చోప్రా నేడు ఈ స్థాయికి రావడానికి దాని వెనుక పడ్డ కష్టాలు నాడు తీసుకున్న నిర్ణయాలు నేడు ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా తన కెరియర్ లో తాను ఎదుర్కొన్న కష్టాలను, పడ్డ అవమానాలను అన్నింటిని మీడియా ముందుకు తీసుకొచ్చారు ప్రముఖ డైరెక్టర్ గుడ్డు ధనోవా…

Priyanka Chopra: It was a decision taken that day..has it changed today..?
Priyanka Chopra: It was a decision taken that day..has it changed today..?

ఎన్నో కష్టాలు పడి.. నేడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుడ్డు ధనోవా మాట్లాడుతూ.. నటన మీద ఎటువంటి అవగాహన లేదు. కానీ తెరపై తనను తాను చూసుకోవాలనుకుంది. అందులో భాగంగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రియాంక చోప్రా.. కేవలం ఆమెకు నేర్చుకోవాలని తపన మాత్రమే ఉండేది. ఆమెతో బిగ్ బ్రదర్ సినిమా తీశాను.. ఆ సమయంలో నా వద్దకు తను వచ్చి సార్ దయచేసి ఈ సీన్స్ ఎలా చేయాలో నాకు చెప్పండి అని అడిగి తెలుసుకునేది. తన పాత్రకు ఎలాగైనా సరే న్యాయం చేయాలని ఎంతో శ్రమించేది. అయితే దాదాపు 20 రోజులు షూటింగ్లో కష్టపడిన తర్వాత ముంబై రిపోర్ట్స్ ఆమె నటన బాగాలేదని , ఆమె అందంగా లేదని వచ్చాయి. అప్పటివరకు షూట్ చేసినదంతా డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. నేను, సన్నీడియోల్ వాటన్నింటినీ చూసి ఆమెతోనే సినిమా చేయాలని అనుకున్నాం. స్క్రీన్ పై ఆమె కనిపించిన విధానం మాకు చాలా బాగా నచ్చింది. ఆమె కెరియర్ లో మంచి స్థాయికి వెళ్తుందని మేమిద్దరం అప్పుడే అనుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్.

ప్రియాంక చోప్రా తొలి పరిచయం..

ఇకపోతే తొలిసారి ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. విజయ్ దళపతి హీరోగా నటించిన తమిళన్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.

- Advertisement -

ఈమె స్టార్ స్టేటస్ ని చూసి ఓర్వలేకపోయిన బాలీవుడ్..

అయితే బాలీవుడ్ లో ఈమె స్టార్ స్టేటస్ ని చూసి బాలీవుడ్ సినీ పరిశ్రమ ఓర్వలేకపోయింది. అవకాశాలు రాకుండా చేసింది. దీంతో ఎలాగైనా సరే తన తాను నిరూపించుకోవాలని అనుకుంది.. పడినచోటే లేవాలని నిర్ణయించుకున్న ఈమె భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడింది. నాడు అలా నిర్ణయించుకుంది కాబట్టే నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటూ అత్యధిక పారితోషకం తీసుకుంటూ ఎంతోమందికి చెప్పు దెబ్బగా నిలిచింది ప్రియాంక చోప్రా. ఏది ఏమైనా ఈమె ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శమని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు