Priyanka Chopra: కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టిన ప్రియాంక..పోస్ట్ వైరల్..!

Priyanka Chopra.. తమిళ సినీ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ప్రియాంక చోప్రా .. ప్రస్తుతం హాలీవుడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే.. ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.. తాజాగా ఆ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీస్ ద్వారా చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా..చాలా కాలం విరామం తర్వాత ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతుందని తెలుస్తోంది .. ఈ క్రమంలోనే త్వరలోనే భారీ అంచనాలున్న చిత్రం “ది బ్లఫ్” చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.. ఫోటోలను షేర్ చేసిన ఈమె ఓం చిహ్నంతో స్క్రిప్ట్ పేపర్లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.. ఇక దీన్ని బట్టి చూస్తే ఈమె మంచి విశ్వాసంతోనే తన పనిని ప్రారంభిస్తోందనీ చెప్పవచ్చు. ఇక తాజాగా ది బ్లఫ్ ఇది ప్రారంభం అవుతుంది అంటూ తన ఇన్స్టా స్టోరీస్ లో రాసుకుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ది బ్లఫ్:

Priyanka Chopra: Priyanka started a new project..post viral..!
Priyanka Chopra: Priyanka started a new project..post viral..!

ప్రస్తుతం ఈమె ఆస్ట్రేలియాలో తన రాబోయే సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.. కార్ల్ అర్బన్ తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ చిత్రానికి ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు క్రియేట్ చేసిన హిట్ చిత్రం బాబ్ మార్లే : వన్ లవ్ ఈ చిత్రానికి సహా రచయితగా పనిచేస్తున్నారు..

ది బ్లఫ్ సినిమా స్టోరీ:

ది బ్లఫ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 19వ శతాబ్దపు కరేబియన్ నాటి కథ అని తెలుస్తోంది.. అలాగే మాజీ మహిళ పైరేట్ కథను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం .. మహిళా పైరేట్ తన గతం యొక్క రహస్యమైన విషయాలను వెలికి తీసి.. తన కుటుంబాన్ని రక్షించడానికి ఆమె ఎలాంటి సాహసం చేసింది అనే పాత్రలో ప్రియాంక చోప్రా నటించబోతోంది.. ప్రస్తుతం ఈ సినిమాను ఆస్ట్రేలియాలో ప్రారంభించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..

- Advertisement -

ది బ్లఫ్ సినిమా నిర్మాతలు:

ఈ సినిమాని ఏజీబీవో బ్యానర్ పై ఆంథోనీ రస్సో, జో రస్సో, ఏంజెలా రస్సో – ఓట్ స్టాట్ తోపాటు మైకేల్ డిస్కో నిర్మించనున్నారు.. అలాగే సినీ స్టార్ పిక్చర్స్ బ్యానర్ పై సిసెలీ సల్దానా తో పాటు మారిల్ సల్దానా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రియాంక చోప్రా తదుపరి సినిమాలు..

ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒక ఇండియాలోనే కాకుండా యూఎస్ఏ లో కూడా అసమానమైన స్టార్ డం ను సొంతం చేసుకుంది.. ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ది బ్లఫ్ సినిమాతో పాటూ సిటాడెల్ -2 సినిమాతో పాటు హెడ్ ఆఫ్ స్టేట్ తో సహా రెండు హాలీవుడ్ ప్రాజెక్టులలో నటించనుంది అలాగే ఆలియా భట్ కత్రినా కైఫ్ లతో కలిసి నటిస్తున్న జీలే జరా సినిమాతో మళ్లీ బాలీవుడ్లోకి రానుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే తన కొత్త ప్రాజెక్టును ప్రకటించి అందరిని ఆశ్చర్యపరుస్తోంది ప్రియాంక చోప్రా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు