Priyanka Chopra: అతనితో రొమాన్స్…..వీడియో లీక్…!

 

Priyanka Chopra: సినిమా ప్రపంచంలో స్టార్ హీరోయిన్గా నిలవడం చాలా కష్టం. నటన, అందంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి వారిలో నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఒకరు. సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుతోంది. కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా తన హవాను చూపిస్తున్న ఈ భామ ఈ మధ్యకాలంలోనే గ్లోబల్ స్థాయికి ఎదిగింది. అతి చిన్న వయసులోనే ప్రియాంక చోప్రా మోడల్ గా తన ప్రయాణం ప్రారంభించింది.

అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే హాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకొని అక్కడికి వెళ్లిపోయింది. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి అక్కడే ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను (NIK) వివాహం చేసుకుంది. అతని వీడియోలలో పలుమార్లు ప్రియాంక నటించి మెప్పించింది. హాలీవుడ్ లోకి వెళ్లినప్పటికీ మన భారత సాంస్కృతిని మర్చిపోకుండా భర్త పేరుని తన పేరు వెనకాల పెట్టుకుంది ప్రియాంక చోప్రా (Priyanka Chopra) .

- Advertisement -

వివాహ అనంతరం తన సోషల్ మీడియా అకౌంట్లో తన పేరు చివర ప్రియాంక చోప్రా జోనాస్ గా మార్చుకుంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, అప్డేట్లను తన అభిమానులకు అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రియాంకకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రియాంక ఓ వ్యక్తితో రొమాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు తన భర్త నిక్ జోనాస్. ఈ వీడియో ఏదైనా షూట్ కోసం చేసినట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

https://x.com/UmairSandu/status/1829893564341567528

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు